బంధువే కదా అని పెళ్లికి పిలిస్తే.. ఏం చేసాడో తెలుసా?

praveen
సాధారణంగా పెళ్ళికి బంధుమిత్రులందరికీ ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలిసీ తెలియని బంధువులందరిని కూడా పెళ్లికి ఆహ్వానించడం లాంటివి చేస్తూ ఉంటారు. పెళ్లికి బంధువులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడం లాంటివి కూడా చేస్తారు. కానీ ఇక్కడ ఒక బంధువును పిలవడమే వాళ్ళకి పెద్ద సమస్యగా మారిపోయింది. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని  పిలిస్తే బంధువుల ఇంటికి వచ్చి చేతివాటం చూపించాడు ఇక్కడ ఒక వ్యక్తి.

 ఇంట్లో ఉన్న నగదు ఆభరణాలు మొత్తం ఎత్తుకుపోయాడు ఈ క్రమంలోనే ఇక పెళ్లికి ముందు అటు కుటుంబ సభ్యులందరికీ ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. చివరికి పెళ్లి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగను అరెస్టు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇంతకుముందు చేసిన దొంగతనాలు కూడా ఒప్పేసుకున్నాడు. ఈ ఘటన సుజాతనగర్ లో వెలుగులోకి వచ్చింది.మున్షి లీఖాయత్ కుమారుడు వివాహము ఉండడంతో బంధువైన షేక్ సాహిద్ ను పెళ్లికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అందరూ బిజీ బిజీగా ఉన్నారు. ఆ సమయంలో చేతివాటం చూపించి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చివరికి నగదు నగలు ఎత్తుకు వెళ్తాడు సాహిద్.

 లీఖాయత్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఏం జరిగింది అనే విషయాలను గ్రహించారు. ఈ క్రమంలోనే షేక్ సాహిద్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చివరికి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వీటితో పాటు పట్టణంలోని మరో నాలుగు స్టేషన్ల పరిధిలో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అయితే పగలు మొత్తం ఆటో నడుపుతూ జీవనం సాగించే షేక్ సాహిద్ రాత్రి సమయంలో మాత్రం దొంగగా మారి ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: