దారుణం: నాలుగేళ్ల కొడుకుపై లైంగిక కోరిక తీర్చుకున్న తండ్రి..!

MOHAN BABU
కాలం మారుతున్నది. రోజులు మారుతున్నాయి. మనుషులు కూడా మారుతున్నారు. సంబంధబాంధవ్యాలు మసకబారి పోతున్నాయి. సొంత కుటుంబీకులపైనే అఘాయిత్యాలు చేసే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తండ్రి బిడ్డ పై లైంగిక దాడి, అన్న చెల్లి పై లైంగిక దాడి, ఇలా వావివరసలు లేకుండా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇక్కడ దాని కంటే నీచమైన ఆ అఘాయిత్యానికి  పాల్పడ్డాడు ఓ తండ్రి. మరి ఆయన ఏం చేశాడు. ఏం జరిగింది. తెలుసుకుందాం..!
 రోజురోజుకు అత్యాచార ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

 ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన, ఎన్ని శిక్షలు వేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇదే కోవకు చెందిన ఓ తండ్రి తన కన్న కొడుకు పై లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని ఉప్పల్లో చోటు చేసుకుంది. తన యొక్క నాలుగు సంవత్సరాల కొడుకు పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ కర్కశక తండ్రి. దీంతో బాలుడి తల్లి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం కాస్త బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే అప్సిగూడకు చెందిన వీణరెడ్డికి ఉప్పల్ కు చెందినటువంటి భరత్ రెడ్డితో గత 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి సంసార జీవితం బాగానే సాగింది. తర్వాత చిచ్చు మొదలైంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విడాకుల విషయం కోర్టులో ఉండగానే, తన కొడుకును తన  దగ్గరే ఉంచాలని భరత్ రెడ్డి కోర్టులో  పిటిషన్ వేశారు.

దీంతో కోర్టు వారానికి ఒకసారి నీ కొడుకుని కలుసుకోవచ్చు అని తీర్పునిచ్చింది. కానీ భరత్ రెడ్డి తన కొడుకుని తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వీణరెడ్డి ఆరోపిస్తోంది. అలాగే బాబుపై లైంగిక వేధింపులు జరిగినట్లు వైద్యులు నిర్ధారించారని వీణరెడ్డి తెలుపుతోంది. దీంతో బాబు తన భర్త వద్దకు అసలు పంపనని వినారెడ్డి చెబుతోంది. అలాగే వీణరెడ్డిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: