ఎట్టెట్టా.... ఎమ్మెల్యే కుమారుడే నిందితుడా ? !

Vennelakanti Sreedhar

గ్యాస్ లీకై దంపుతులు సజీవ దహనం అయ్యారు. వారితో బాటు ఇద్దరు కుమార్తెలు కూడా అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వారిలో ఒక బాలిక మృతి చెందగా, మరో బాలిక తీవ్రగాయాలతో చావుబతుకుల్లో ఉంది. ఈ ఘటన కొత్త పాల్వంచ లో జరిగింది.  ఈ కేసును తొలుత  పోలీసులు ప్రమాదవశాత్తుగా నమోదు చేశారు అయితే వారికి విస్తు పోయో నిజాలు తెలిసాయి.  దీంతో వారు ఎం.ఎల్.ఏ కుమారుడి పేరు ఎఫ్.ఐ.ఆర్ లో నమోదు చేశారు. ఇంతకీ ఎవరా ఎం.ఎల్.ఏ ?
తెలంగాణ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త పాల్వంచ లో విషాదం చోటుచేసుకుంది. పాల్వంచలో మీ సేవ కేంద్రాన్ని నిర్వహించే రామ కృష్ణ, శ్రీ లక్ష్మి దంపతులకు సాహితి, సాహిత్య అనే ఇద్దరు కవలలున్నారు. ఆయన ఆ ఊరి తూర్పు బజారులో మీ సేవ కేంద్రం నిర్వహించే వారు. చూడముచ్చటైన జంట అన్యోన్య దాంపత్యం.ఎలాంటి చీకూ చింతా లేదు. అయితే రెండు నెలల క్రితం రామకృష్ణ తవ మీ సేవ కేంద్రాన్ని ఇతరులకు విక్రయించారు. తన మకాం ను రాజమండ్రికి మార్చారు. రెండుమూడు రోజుల క్రిందట ఆ దంపతులు తాము నివాసం ఉన్న గృహానికి వచ్చారు.  ఈ ఉదయం ఇంటిలోనుంచి గ్యాస్ లీకైన వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లు చూడగా  రామకృష్ణ దంపతులు అగ్నికి ఆహుతై కనిపించారు. ఇద్దుర పిల్లల్లో ఒకరు కూడా అక్కడే మరణించి ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న బాలికను పోలీసులు. అగ్ని మాపక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద వశాత్తు జరిగిన ఘటనగా తొలుత  భావించారు. అయితే వారికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఘటనా స్థలంలో క్గూస్ టీం స్వాధీనం చేసుకున్నపత్రాలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్ లో కొత్త గూడెం ఎం.ఎల్.ఏ వనమా వెంకటేశ్వర రావు కుమారుడు రాఘవేందర్ పేరును  చేర్చారు. ఈ విషయాన్ని పాల్వంచ ఏఎస్పీ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాఘవేందర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: