సినీఫక్కీలో ఏనుగు కిడ్నాప్.. రూ.40లక్షలు డీల్.. చివరికీ..!!

N.ANJI
సమాజంలో క్రైమ్ రేట్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది సినీ పక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఏనుగుని దొంగతనం చేయబోయిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని తుమకూరు జిల్లా కేంద్రంలో గల కరిబసవస్వామి మఠానికి చెందిన లక్ష్మి అనే ఏనుగు ఇటీవల దొంగతనము చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులను సహ నిందితులుగా పేర్కొంటూ పోలీస్ స్టేషన్లో కేసు చేశారు.
ఇక కరిబసవస్వామి మఠానికి వచ్చే చిన్న పిల్లలను సైతం ఆత్మీయంగా ఆశీర్వదించే లక్ష్మిని అపహరించాలని కు చెందిన ఓ సర్కస్ కంపెనీ నిర్వాహకులు భారీ వ్యూహాన్ని రచించినట్లు పేర్కొన్నారు. ఇది ప్రొఫెషనల్ కిడ్నాపర్లు వెటర్నరీ డాక్టర్ల వేషంలో మఠాన్ని సందర్శించినట్లు వెల్లడించారు. కాగా.. మఠం నిర్వాహకులతో మాట కలిపిన దొంగల ముఠా.. ఏనుగుకు వైద్యపరీక్షలు నిర్వహించి, దాని కడుపులో గడ్డ ఉందని నిర్ధారించినట్లు తెలిపారు.
అయితే వెటర్నరీ డాక్టర్ల ముసుగును గుర్తించలేక మఠం నిర్వాహకులు కిడ్నాపర్లు చెప్పిన మాటలు నమ్మి.. ఏనుగును బన్నేరుఘట్టలోని పశువైద్యశాలకు తరలించేందుకు ఒప్పుకొన్నారు. ఇక కొద్ది రోజుల తర్వాత ఆ ముఠా సభ్యులు తిరిగి మఠానికి వచ్చి లారీలో ఏనుగును తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
అంతేకాదు.. లారీలోని ఏనుగును కుణిగల్ తాలూకాలోని ఓ గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచినట్లు తెలిపారు. ఇక వీలైన టైమ్ లో దాన్ని గుజరాత్ తరలించాలని వారు ప్లాన్ చేశారు. అయితే  ఏనుగును అపహరించారనే సమాచారం తెలుసుకున్న మఠం నిర్వాహకులు కుణిగల్ తాలూకాలో అడుగడుగునా వెతికారు. ఇక చివరకు ఓ గ్రామ శివారులో దాచి ఉంచిన ఏనుగును గుర్తించి, మరో లారీలో దానిని మఠానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక వారు ఏనుగును కిడ్నాప్ చేసేందుకు రూ.40 లక్షలకు డీల్ కుదిరినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. అనంతరం మఠం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు తుమకూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: