సంబంధం పెట్టుకుని.. స‌స్పెండ్‌..!

N ANJANEYULU
వారిద్ద‌రూ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వ‌హిస్తున్నారు. వారిద్ధ‌రికీ ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త చిగురించి వివాహేత‌ర సంబంధం కు దారి తీసింది. వారు వివాహం పెట్టుకోవ‌డంతో ఏకంగా పోలీస్ శాఖ ప‌రువు తీసిన‌ట్టు అయింది. దీంతో వారిరువురిని స‌స్పెండ్ చేశారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా క‌న‌గాన‌ప‌ల్లి మండ‌లం త‌గ‌ర‌కుంట‌కు చెందిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాజు 2018వ బ్యాచ్‌. ప్ర‌స్తుతం అనంత‌పురం పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈయ‌న‌కు క‌ల్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఒక మ‌హిళ‌తో రెండేళ్ల క్రిత‌మే వివాహం జ‌రిగింది. ఇత‌ని భార్య త‌ల్లి దండ్రుల‌కు కేవలం ఒక్క‌రే సంతానం. ఇత‌నికి క‌ట్న కానుకుల కింద రూ.20లక్ష‌ల న‌గదు, ప‌ది తులాల బంగారం, ఒక కారు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.  
ఇది ఇలా ఉండ‌గా.. హ‌ర్శ‌వ‌ర్ధ‌న్ కు గ‌త కొన్ని ఏండ్ల  క్రితం ఏఆర్ విభాగంలో ఓ మ‌హిళా కానిస్టేబుల్ తో  ప‌రిచయం ఏర్ప‌డింది. ఇది కాస్త హ‌ద్దులు మీరి వివాహేత‌ర సంబంధం వ‌ర‌కు దారి తీసింది. దీంతో త‌రుచూ ఆ కానిస్టేబుల్ ఇంటికి వెళ్తుండేవాడు. ఈ విష‌యంపై హ‌ర్శ‌వ‌ర్ధ‌న్‌ను భార్య నిల‌దీయ‌గా ఆమె చెల్లిలాంటిది అని స‌మాధానం చెప్పేవారు.  ఎప్పుడు ఏదో ఒక వంక చెప్పి ఆయ‌న మ‌హిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్తున్నాడు. దీంతో భార్య‌కు అనుమానం క‌లిగి ఉన్న‌ట్టుండి ఒక రోజు  కాస్త గ‌ట్టిగానే నిల‌దీసింది. దీంతో ఆయ‌న పోలీస్ డిపార్టుమెంట్‌లో ఇలాంటివ‌న్ని స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, దీనిని లైట్ తీసుకోవాల‌ని భార్య‌కు సూచించారు. భ‌ర్త చెప్పిన స‌మాధానంతో భార్య విసుగుచెందిన పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా భార్య‌ను తిరిగి తీసుకురావ‌డానికి ఏనాడు కూడ వెళ్ల‌లేదు కానిస్టేబుల్‌. చివ‌రికి పెద్ద‌ల స‌మ‌క్షంలో పంచాయ‌తీ జ‌రిగినా కానీ ఆయ‌న త‌న ప్ర‌వ‌ర్త‌ను మాత్రం మార్చుకోలేదు. దీనితో బాధితురాలు, ఆమె తండ్రి   బ్ర‌హ్మ‌స‌ముద్రం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేప‌ట్టారు. ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు  ఈ విష‌యాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ అధికారుల నివేదిక ఆధారంగా కానిస్టేబుల్ హ‌ర్శ‌వ‌ర్ధ‌న్‌రాజుతో పాటు ఆ మ‌హిళా కానిస్టేబుల్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు ఎస్పీ.          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: