దారుణం : హోంవర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసాడో తెలుసా?

praveen
ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకాలు అని చెబుతూ ఉంటారు పెద్దలు.  మంచి చెడులను నేర్పించి సభ్య సమాజంలో ఎంతో ఉత్తమంగా బ్రతకడం నేర్పించేది ఉపాధ్యాయులే అని అంటూ ఉంటారు. ఇలా సన్మార్గంలో నడిపించి జీవిత పరమార్థాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చేయాల్సిన ఉపాధ్యాయులే చివరికి యమకింకరులుగా మారి పోతే. మంచి చెడులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే చివరికి ప్రాణం తీస్తే. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఇలాంటి అమానుష ఘటన కే పాల్పడ్డాడు. సాధారణంగా హోంవర్క్ చేయకపోతే విద్యార్థులను ఉపాధ్యాయులను మందలించడం కామన్. కానీ ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు మాత్రం తన కోపాన్ని మొత్తం విద్యార్థి పైన తీర్చుకున్నాడు.

 చివరికీ దెబ్బలు తాళలేకపోయినా సదరు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్లోని చురు లో వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో 13 ఏళ్ల విద్యార్థిని టీచర్ విచక్షణరహితంగా కొట్టడంతో చివరికి ప్రాణాలు వదిలాడు సదరు విద్యార్థి.  కొట్టొద్దు సార్ ప్లీజ్ అంటూ ఆ విద్యార్థి ఎంత వేడుకున్నప్పటికీ   ఉపాధ్యాయుడు మాత్రం కనికరించలేదు. ఏకంగా గ్రౌండ్ లో పడేది దారుణంగా చితకబాదాడు. చేతిలో బెత్తం ఉంది కదా అని రెచ్చిపోయాడు. రాజస్థాన్లోని చురు జిల్లా సల్సార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనే కొలసర్ గ్రామంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు విద్యార్థి గణేష్.

 కాగా ఇటీవలే టీచర్ ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయకుండా స్కూల్ కి వెళ్ళాడు. దీంతో టీచర్ మనోజ్ కుమార్ రెచ్చిపోయాడు. ఏకంగా విద్యార్థిని చితకబాదడంతో అపస్మారక స్థితిలో గ్రౌండ్ లో పడిపోయాడు విద్యార్థి. తోటి విద్యార్థులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ఘటన గురించి తెలిసినా ప్రభుత్వం వెంటనే ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పోలీసులు ఆ కీచక టీచర్ ను అదుపులోకి తీసుకొని కటకటాల వెనుకకు తోసారు. అతనిపై కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: