డేరాబాబాకు ఏం శిక్షపడింది ?

Vennelakanti Sreedhar

 డేరాబాబాకు ఏం శిక్షపడింది ?
డేరా బాబా... వివాదాస్పద  మత గురువు,  చండీఘర్ కేంద్రంగా ఉన్నఆశ్రమం డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు. ఇతని అసలు పేరు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. ఇతనికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇతని తో పాటు స్వామీజీకి అనుచరులుగా ఉన్న మరో నలుగురికి కూడా  న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. వాస్తవానికి  సి.బి.ఐ కోర్టు  గతంలో స్వామీజీ అతని శిష్యులు నేరస్తులని పేర్కోంది. తాజాగా  పంచకులలోని సి.బి.ఐ కోర్టు సోమవారం శిక్షను ఖరారు చేసింది.సీబీఐ న్యాయమూర్తి సుశీల్ గార్గ్ తీర్పును వెల్లడించారు.
 డేరా సచ్చా సౌదా  ఆశ్రమం మేనేజర్ 2002 లో హత్యకు గరయ్యాడు. ఈ హత్యతో  డేరాబాబాకు సంబంధం ఉందని  ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో  పోలీసులుకేసు నమోదు చేశారు. ఆ తరువాత సి.బి.ఐ కేసు దర్యాప్తు చేసింది.
డేరా సచ్చా సౌదా ఆశ్రమంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలతో లేఖ ఒకటి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ లేఖ వెనుక ఆశ్రమం మేనేజర్ రంజిత్ సింగ్ కారకుడని డేరాబాబా భావించారు. కోంత కాలానికి అతను హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక డేరాబాబా హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు, సి.బి.ఐ తగిన సాక్ష్యాలతో డేరాబాబా అతని ఐదుగురు అనుచరులపై చార్జిషీట్ దాఖలు చేసింది. డేరాబాబా అనుచరుల్లో ఒకరు ఇదివరకే మృతి చెందారు. ఈ కేసులో వీరందరినీ నిందితులుగా సి.బి.ఐ కోర్టు పేర్కోంది. తాజాగా సోమవారం శిక్షను ఖరారు చేసింది. డేరాబాబాకు జీవిత ఖైదు విధించింది. 31 లక్షల రూపాయలు జరిమానా విధించింది. మరో నలుగురు నిందితులు ఒక్కోక్కరికీ 75 వేల రూపాయల జరిమానా తో పాటు శిక్షను విధించింది. జరిమానా మొత్తంలో ఐదు శాతం నగదును మృతుడు రంజిత్ సింగ్ కుటుంబానికి చెల్లించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది. డేరాబాబా అత్యాచారం కేసులు 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: