అమలాపురంలో దారుణం..! ఏమి జ‌రిగిందంటే..?

N ANJANEYULU
ఒంట‌రిగా వెళ్లే మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసి ఈ మ‌ధ్య కాలంలో చైన్ స్నాచ‌ర్లు విప‌రీతంగా రెచ్చిపోతున్నారు. క్ష‌ణాల్లోనే మ‌హిళ‌ల‌కు సంబంధించిన బంగారు ఆభ‌ర‌ణాలు, ఇత‌ర వ‌స్తువులు మాయం చేస్తున్నారు. ఏదో ఒక వంక చెప్పి బాధితులు తేరుకునే లోపే త‌ప్పించుకుంటున్నారు. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో ఓ రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లింది. ఇంత‌లోనే గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఆ మ‌హిళ‌ను ఫాలో అయ్యాడు. కొద్ది దూరం వెళ్లాక ఆమె మెడ‌లో ఉన్న న‌గ‌లు లాక్కున్నాడు. ఆమె బోడ‌పాలెం నుంచి అమ‌లాపురంకు ఓ పెళ్లికి హాజ‌రైంది. ఆ మ‌హిళ కూచిమంచి విగ్ర‌హం వ‌ద్ద నుంచి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా దుండ‌గుడు వెన‌క నుంచి క్ష‌ణాల్లోనే వ‌చ్చి న‌గ‌ల‌ను మాయం చేశాడు.
ఆమె తేరుకునే లోపే పారిపోయాడు. తాళిబొట్టు, గొలుసు, న‌ల్ల‌పూస‌లు అన్నీ క‌లిసి సుమారుగా 16 కాసుల బంగారం లాక్కెళ్లారు. దీంతో బాధిత మ‌హిళ రోదిస్తుంది. ఇంట్లో ఏమి స‌మాధానం చెప్పాలో తెలియ‌క బాధ‌ప‌డుతూ పోలీల‌సుల‌కు ఫిర్యాదు చేసింది. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా అమ‌లాపురంలో ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 400 మంది పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  ఇంత పెద్ద నిఘా ఏర్పాటు చేసినా మహిళ మెడ‌లోంచి న‌గ‌లు లాక్కెళ్ల‌డం ఏమిట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులు ఆ దొంగ‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ప‌లు సీసీ పుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. పాత నేర‌స్తుల‌ను ఆరా తీస్తున్నారు. త్వ‌ర‌లోనే నిందితున్ని ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు పోలీసులు.
ఒక అమలాపురంలోనే కాదు దేశ‌వ్యాప్తంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌రుచూ ఎక్క‌డో ఒక చోట చోటు చేసుకుంటూ ఉన్నాయి. పోలీసులు ఎంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేసినా కానీ దుండ‌గులు మాత్రం తాము చేయాల్సింది చేస్తూనేఉన్నారు.  కొన్ని సంద‌ర్భాల్లో డ‌బ్బు ఆశ‌చూపి దృష్టి మ‌ర‌ల్చి మ‌న వ‌ద్ద ఉన్న న‌గ‌దు, వ‌స్తువుల‌ను దోచుకుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో  ఒంట‌రిగా వెళ్తున్న మ‌హిళ‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని బైకు పై వెనుక‌నుంచి వ‌చ్చి ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో ఆ మ‌హిళ మెడ‌లో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాలు దోచుకుంటారు. ఇలా ఏదో ఒక సంద‌ర్భంలో మ‌హిళ‌ల నుంచి విలువైన బంగారు వ‌స్తువులు మాయం చేస్తున్నారు. తాజాగా అమ‌లాపురంలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే పున‌రావృతం అయింది. ఇందుకోసం పోలీసులు దుండ‌గున్ని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: