ఆర్యన్ కు బెయిల్ దొరుకుతుందా.. ఏం..?

MOHAN BABU
ఆర్యన్ ఖాన్ కు ఇవాళయినా బెయిల్ లభిస్తుంది? అతను జైలు నుంచి బయటకు వస్తాడా? ఇవే ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలు. ముంబై సెషన్స్ కోర్టు లో ఇవాళ బెయిల్ పిటిషన్ పై  విచారణ జరగనుంది. ఇంతకీ బెయిల్ ఇవ్వద్దు అంటున్నా ఎన్ సిబి కోర్టుకు ఏం చెప్పబోతోంది. ఆర్యన్ తరఫున న్యాయవాది ఇలాంటి వాదనలు వినిపించబోతున్నారు. ముంబై తీరంలోని కృఇచ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీ లో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఆర్థర్ రూట్ జైల్లో ఉన్నారు. అయితే అతని బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలనేవి  ఇంతవరకు ఫలించలేదు. ఆర్యన్ కు బెయిల్ ఇవ్వద్దంటోంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. దీంతో ఇవాళ ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ పై ఏం చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

 గతవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై మెజిస్ట్రేట్ కోర్టులో వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. తొలుత ఆర్యన్ కు బెయిల్ ఇవ్వద్దనండంతో పాటు అతన్ని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు ఎన్ సిబి అధికారులు. మరోవైపు ఆర్యన్ కు బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపు న్యాయవాది కోరారు. అయితే మాదకద్రవ్యాల కేసుల్లో నిందితుల బెయిల్ మెజిస్ట్రేట్ కోర్టు  పరిధిలో లేదంటూ  వాదనలు వినిపించింది ఎన్ సిబి. ఈ పరిస్థితుల్లో బెయిల్ అంశం తమ పరిధిలో లేదని సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా స్పష్టం చేశారు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి. గత శనివారమె ఆర్యన్  తరపు న్యాయవాది స్పెషన్స్ కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ పిటిషన్ పై సమాధానం చెప్పాల్సిందిగా ఎన్ సిబి కీ కోర్టు నుంచి ఆదేశాలు వెళ్లాయి. కాగా సోమవారం సెషన్స్ కోర్టులో ఆర్యన్ బెయిల్ పై విచారణ జరిగినప్పుడు అతనిని విడుదల చేయవద్దని వాదనలు వినిపించింది ఎన్ సిబి. అతను బయటికి వస్తే సాక్షాలను  ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆర్యన్ కు  సంబంధించి స్టేట్మెంట్లు సమర్పించేందుకు ఇవాల్టి వరకూ ఎన్సీబీకి కోర్టు గడువిచ్చింది.

 ఇవాళ ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. రేవ్ పార్టీలో ఆర్యన్ ను అరెస్టు చేసిన ఎన్ సీబీ అధికారులు అతన్నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోలేదు. తాను డ్రగ్స్ తీసుకోలేదని కూడా ఆర్యన్ అంటున్నారు. అతని స్నేహితులు అర్బాజ్ ఖాన్ వద్ద డ్రగ్స్ ఉన్న అవి కమర్షియల్ స్థాయిలో లేవు. దీంతో ఆర్యన్ తో పాటు అతని స్నేహితులకు బెయిల్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: