దసరా సెలవులకు ఊరెళ్తున్నవారు ఇవి తప్పక పాటించండి?

VAMSI
మాములుగా రెండు సంవత్సరాల నుండి కరోనా భూతం చేతిలో చిక్కుకుని ఇబ్బందులు పడిన ప్రజానీకానికి కాస్త ఉపశమనం దొరికినట్లయింది. ప్రస్తుతానికి కరోనా ప్రభావము అంతగా లేదు. సో ఇక వరుసగా పండుగలు వస్తున్న వేళ అందరూ ఎంతో సంతోషంగా తమ సొంత ఊరికి వెళ్లి గడపడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా మరో రెండు రోజుల్లో దసరా పండుగ రానుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు మరియు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. దీనితో పట్టణాలలో జీవించే ఉద్యోగస్తులు హుషారుగా ఊరికి వెళ్లే పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే అలా ఊరికి వెళుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇదే అదునుగా చూసి దొంగలు తమ చేతి వాటాన్ని చూపే అవకాశం ఉంది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మూడు చోట్ల దొంగతనాలు జరిగాయని తెలుస్తోంది. దీనితో పోలీసులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ దొంగలు కూడా ఎంతో ప్రణాళికతో దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగలు కూడా ఊరికి వెళ్తున్న వారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేస్తున్నారు.
ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలియ చేస్తున్నారు.
* మీరు ఊరికి వెళ్లే సమయంలో ఆ విషయాన్ని పక్కింటి వారికి చెప్పి వెళ్ళండి. ఒక వేళ మీరు లేని సమయంలో      ఎవరైనా వచ్చినట్లు తెలిస్తే వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు.
* మీ ఇంటి చుట్టు పక్కల రోడ్ల మీద తిరుగుతూ అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియ చేయండి.
* మీ ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నట్లయితే ఖచ్చితంగా పోలీసులకు తెలియచేసి వెళ్ళండి.
ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటే దొంగల బారి నుండి రక్షింపబడవచ్చు.  కాబట్టి ఊరికి వెళ్లే వారు అన్ని విధాలుగా జాగత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: