వీడ్ని కూడా భర్త అంటారా ?

Vennelakanti Sreedhar
వీడ్ని కూడా భర్త  అంటారా ?


అరుదైన కేసుల్లో కెల్లా ఇది అరుదైన కేసు అని కోర్టు కూడా వ్యాఖ్యానించిన కేసు ఇది.
భర్త అంటే భరాయించే వాడు అని అర్థం చెబుతుంది తెలుగు నిఘంటువు. నిత్య జీవన విధానంలో భార్య చేసిన తప్పోప్పు లపై  భర్త  సహనం వహించాలి. అప్పడు వైవాహిక జీవితానికి అర్థం ఉంటుంది.  ఒక వ్యక్తిని చంపాల్సినంత కోపం మరో వ్యక్తి కి ఎందుకు వస్తుందో మానసిక వైద్యలు కూడా చెప్పలేకున్నారు. నిద్రపోతున్న భార్యపైకి పామును వదలి చంపాడు ఓ భర్త. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో  జరిగింది.   అంచల్ పట్టణానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల  సూరజ్  కొద్ది సంవత్సరాల క్రితం ఉత్రా అనే మహిళను వివాహం చేసకున్నాడు. కొంత కాలం వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. కాలగమనంలో సూరజ్ మరో మహీళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. దీంతో భార్య ఉత్రాను వదిలించుకోవాలని పథకం వేశాడు.  పది వేల రూపాయలు చెల్లించి
సురేష్ అనే పాములు పట్టే వ్యక్తి దగ్గర ఒక పామును అద్దెకు తీసుకున్నాడు.     2020లో మార్చిలో ఇతను నిద్రిస్తున్న భార్య పై పామును వదిలాడు. పాము కాటు వేసింది. దాదాపు యాభై రోజులు ఆసుపత్రి పాలై చివరకు బ్రతికింది.  చికిత్స క్రమంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించు కోవాల్సి వచ్చింది.   ఉత్రా ఇంటికి వచ్చిన తరువాత ఆమె భర్త  సూరజ్ మరలా ఆమె పై హత్యా యత్నం చేశారు.  నిద్రిస్తున్న సమయంలో  మరో సారి  2020 మే నెలలో ఆమె పైకి పామును వదిరాడు. ఈ ధపా ఆమె మరణించింది. రెండు సార్లు పాము కాటుకు గురికావడంపై అనుమానం వచ్చిన  ఉత్రా తల్లితండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టనా నిందితుడు నిజం ఒప్పుకో లేదు. పోలీసులు  పాము డి.ఎన్.ఏ ను, ఫోరెన్సిక్ ఆధారాలతో ను కోర్టుకు సమర్పించారు. ఇందుకోసం పోలీసులు  2021 సెప్టెంబర్ లో పాము కాటు పై ఒక నమూనా  టెస్ట్ ను కూడా చేయాల్సి వచ్చింది. ఈ కేసును ఛెధించిన పోలీసులను కేరళ  డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీస్  అనీల్ కాంత్ అభినందించారు.  నిందితు డి నేరం రుజువు చేయడం కోసం  కేరళ పోలీసులు చాలా కష్టపడ్డారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: