సంగా రెడ్డి: ఆలస్యంగా వెలుగు చూసిన వివాహిత హత్య..నమ్మించి దారుణంగా !

Surya
ఇల్లు  ఇప్పిస్తానని చెప్పి నగర శివారులో మహిళను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యం గా వెలుగు చూసింది. ఎలాగైనా మోసం చేసో, హత్యలు చేసో జీవితం లో డబ్బు లు సంపాదించుకోవాలనుకునే ఓ ముఠా ఒక  మహిళను పరిచయం చేసి సదరు మహిళను అతి కిరాతకంగా చంపి  నర్సాపూర్ దగ్గర్లో ఉన్న రుస్తుం పేట్ శివారు ప్రాంతం లో ఆ మహిళా మృత దేహాంను వదిలి వెళ్లారు. ఈ క్రమంలో ఆ మహిళా దగ్గర ఉన్న బంగారు గొలుసులు వెండి , డబ్బు ను తీసుకోని హంతకులు పరారయ్యారు. సంగారెడ్డి జిల్లా నేతాజీ నగర్ లో అమృత (50) అనే మహిళ  ఒంటరిగా ఉంటోంది. అక్టోబర్ 9 న ఆమె కుమార్తె అమరేశ్వరి తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీస్ అధికారులు తక్షణమే ఆ కేసుపై పురోగతి సాధించారు.


 పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి. అమృతకు కొన్ని రోజుల క్రితం ఓ మహిళ అద్దె ఇంటికోసం తిరుగుతూ పరిచయం అయ్యింది. ఈ క్రమంలో అమృత గురించి వివరాలు సేకరించింది. ఆమె వద్ద డబ్బు , నగలు భారీగా ఉన్నాయ్ అని తెలిసి . తన టీమ్ తో స్కెచ్ వేసింది. స్కెచ్ లో భాగం గా సదరు మహిళ అమృతను కొత్త ఇల్లు చాల తక్కువ ధరలో ఇప్పిస్తానని చెప్పింది . ఇల్లు తక్కువ ధరకు దొరుకుతుందనే అత్యాశపడిన అమృత ఆ కొత్త ఇల్లు కొనుకోవడానికి ఆ కన్నింగ్ మహిళతో కలసి రుస్తుం పేట్ శివారు ప్రాంతం వెళ్ళింది. ఆ ప్రాంతం లో అప్పటికే నలుగురు ఎదురుచూస్తున్నారు. ఆ నలుగురు కూడా మద్యం సేవించి ఉన్నారు. ఆ గ్రూప్ లో ఇద్దరు మహిళలు ఉండటం విశేషం .


 అమృతను మొదట డబ్బులకోసం బెదిరించారు ఆమె ఒప్పుకోక పోగా చిత్రహింసలకు గురిచేసి చంపారు . అనుమానం రాకుండా మద్యం తాగించారు. ఆ తరువాత ఆమె దగ్గర ఉన్న 70 వేలరూపాయలను, ఆరు తులాల బంగారం ను , 40 తులాల వెండిని తీసుకోని పారిపోయారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని త్వరిత గతిన ఛేదించారు. హంతకులను పట్టుకుని మీడియా ముందు హాజరు పరచారు . ఈ హత్య లో  గీత (34),  లలిత (59), సౌజన్య (18) ,అశోక్ (43 ), కుమార్ ( 41) అనే నలుగురిని 9 వ తారీఖున అరెస్టుచేసి విచారించగా జరిగింది చెప్పారు. మహిళలు అనే సున్నిత హృదయులు అంటారు అలంటి వీరికి ఇలాంటి దారుణమైన హృదయం ఉందాటటం స్త్రీ జాతికి మాయని మచ్చ. ఈ సందర్భం తెలుసుకో వలసిన నీతి ఏమిటంటే పరిచయం లేని , మంచి ముంచే వాళ్ళని కనిపెట్టి వారితో జాగర్త గా ఉండటం ఎంతైనా మంచి పని

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: