వ్య‌క్తి గ్ల‌లంతు.. ఆ త‌రువాత సేఫ్‌..!

N ANJANEYULU
నైరుతి బంగాళ‌ఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిశాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం సంభ‌వించింది. హ‌య‌త్‌న‌గ‌ర్ నుంచి మొద‌లుకొని ఈ చివ‌రి నుంచి ఆ చివ‌రి వ‌ర‌కు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసింది. జీహెచ్ ఎంసీ అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. గోల్కొండ‌లో విఫ‌రీత‌మైన‌ వ‌ర్షం వ‌చ్చింది. బీజేపీ ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ సంబురాలు నిర్వ‌హించారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి పాల్గొన్నారు. వ‌ర్షాన్ని లెక్క చేయ‌కుండా మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ ఆడ‌డం గ‌మ‌నార్హం.
ఇదంతా ఒక ఎత్త‌యితే తాజాగా ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని చింత‌ల‌కుంట‌లో విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న చోటు చోసుంది. అంద‌రూ ఓ వ్య‌క్తి గ‌ల్లంతు కావ‌డంతో భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. నాలాలో బైకుతో స‌హా కొట్టుకుపోయాడు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హుటాహుటిన ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని నాలాలో కొట్టుకుపోయిన వ్య‌క్తి కోసం గాలింపులు చేప‌ట్టారు. దీంతో విజ‌య‌వాడ‌ జాతీయ ర‌హ‌దారి  ట్రాఫిక్ జామ్ అయింది. కొద్ది సేప‌టికి నాలాలో ప‌డిన వ్య‌క్తి సేఫ్‌గా బ‌య‌టికి వ‌చ్చాడు. క‌ర్మ‌న్‌ఘాట్‌కు చెందిన జ‌గ‌దీశ్ అనే వ్య‌క్తిగా గుర్తించారు పోలీసులు.  చింత‌ల‌కుంట వ‌ద్ద  ర‌హ‌దారి చెరువులా త‌ల‌పించ‌డంతో ఏదీ రోడ్డో ఏది నాలా తెలవ‌ని ప‌రిస్థితి.    జ‌గ‌దీశ్ అనే వ్య‌క్తి బైకుతో పాటు ఒక్క‌సారిగా నాలాలో కొట్టుకుపోయాడు.  
ఈ విష‌యం తెలుసుకున్న జీహెచ్ ఎంసీ అధికారులు, డీఆర్ ఎఫ్ బృందాలు అత‌ని కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. క‌ర్మ‌న్‌ఘాట్‌లో నివాసం ఉంటాడు  జ‌గ‌దీశ్ అనే వ్య‌క్తి.  రంగారెడ్డి జిల్లా మంచాల కు చెందిన బోద‌సు జ‌గ‌దీశ్ ను  రెస్య్కూటీమ్ ర‌క్షించింది. ఏపీ 24 ఏహెచ్ 3414 నెంబ‌ర్ గ‌ల ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తుండ‌గా చింత‌ల‌కుంట వ‌ద్ద ఒక్క‌సారిగా నాలాలోకి కూరుకుపోయాడు. తొలుత బైకును వెలికి తీశారు రెస్క్య టీమ్‌.  కొద్ది సేప‌టికీ ఒక తాడును ప‌ట్టుకొని వేలాడ‌డంతో జ‌గ‌దీశ్ సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డాడు. తాడు దొరికి ఉండ‌క పోతే జ‌గ‌దీశ్ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉండేది.  తాడు దొర‌క‌క‌పోతే త‌న సోద‌రుడు ఇక ఉండేవాడు కాద‌ని జ‌గ‌దీశ్ సోద‌రుడు వెల్ల‌డించాడు. మొత్తానికి వ‌ర్షం అంద‌రినీ ఇబ్బందులకు గురి చేసింది. ఇంకో రెండు రోజుల పాటు వ‌ర్షం ఉండ‌వచ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: