స్కూల్‌కు వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాల‌కు... ఏమైందంటే...?

N ANJANEYULU
రోజు మాదిరిగానే స్కూల్‌కు వెళ్లి వ‌స్తాన‌ని ఓ బాలుడు త‌న ఇంటి నుంచి బ‌య‌లు దేరాడు. ఆ ఇంట్లో ఆ బాలుడి చివ‌రి మాట‌ల‌య్యాయి. పాఠ‌శాల‌కు వెళ్లి స్నేహితుల‌తో సంతోషంగా.. త‌ర‌గతుల‌ను విన్నాడు. ఉన్న‌ట్టుండి బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్క‌డే మొద‌లైంది అస‌లు స‌మ‌స్య‌. బాత్‌రూంలో ఆ బాలుడిని తేలు కాటేసింది. ఈ విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్లితే..   నెల్లూరు జిల్లాలోని అనంత‌సాగ‌రం మండ‌లం కామిరెడ్డిపాడు ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఓ విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. కామిరెడ్డిపాడు గ్రామానికి చెందిన స‌త్యాల శ్యాంప్ర‌సాద్ దంప‌తుల‌కు ఒక కుమారుడున్నాడు. అత‌ని పేరు అభిషేక్ (11). కుమారుడితో పాటు ఇద్ద‌రు కూతుర్లున్నారు.
అభిషేక్  స్థానిక‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఐదోత‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. రోజు మాదిరిగానే య‌ధావిధిగా పాఠ‌శాల‌కు వెల్లాడు అభిషేక్‌. మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం స‌మ‌యంలో స్కూల్‌లో ఉన్న మ‌రుగుదొడ్డిలోకి వెళ్లాడు. ఈ స‌మ‌యంలో మ‌రుగుదొడ్డిలో ఉన్న అభిషేక్ ఎడ‌మ చేతికి తేలు కాటు వేసింది. ఉపాధ్యాయులు అభిషేక్‌కు  తేలు  కాటు వేసినద‌ని త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు.  అనంత‌రం హుటాహుటిన త‌ల్లిదండ్రులు, కుటుంబ‌స‌భ్యులు పాఠ‌శాల వ‌ద్ద‌కు చేరుకొని అనంత‌సాగ‌రంలో ప్రాథ‌మిక చికిత్స‌చేయించారు. త‌దంన‌త‌రం ఆత్మ‌కూరులో ఉన్న ఓ ప్ర‌యివేటు ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. అక్క‌డ కొద్ది సేపు చికిత్స పొందాడు.
అప్ప‌టికే అత‌ని ప‌రిస్థితి విష‌మించ‌డంతో అక్క‌డి నుంచి నెల్లూరు తీసుకెళ్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో మ‌ర‌ణించాడు. త‌మ‌కు ఉన్న ఏకైక కుమారుడి అల్లారుముద్దుగా పెంచుకున్న త‌ల్లిదండ్రులు ఆక‌స్మాత్తు మృతి చెంద‌డంతో శ్లోక సంద్రంలో మునిగిపోయారు. త‌ల్లిదండ్రుల‌తో పాటు కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, స్థానిక గ్రామ‌స్తుల రోద‌న‌లు మిన్నంటిపోయాయి. క‌ళ్ల ముందే క‌నిపించిన అభిషేక్ స‌డ‌న్‌గా కాన‌రాని లోకాల‌కు వెళ్ల‌డంతో గ్రామంలో ఎవ‌రినోట చూసిన అత‌ని గురించే చ‌ర్చ‌లు. మ‌రోవైపు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌రుగుదొడ్డిని కూల్చివేసి నూత‌నంగా నిర్మాణం చేప‌ట్టాల‌ని స్థానికులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అభిషేక్ ప‌రిస్థితి మ‌ర‌ల ఏ విద్యార్థికి పున‌రావృతం కాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: