కూలిన ఇల్లు... ఏడుగురు మృతి...!

N ANJANEYULU
వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే శిథిలావ‌స్థ‌కు చేరిన ఇళ్ల‌న్ని కూలిపోతుంటాయి. పురాత‌న‌మైన‌వి కావ‌డంతో రెండు, మూడు రోజుల పాటు ఎడ‌తెరిపిలేకుండా వ‌ర్షాలు కురిస్తే గోడ‌లు బాగా నానుతుంటాయి. దీంతో ఏ గోడ ఎప్పుడు కూలుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.  పాత‌కాలంలో ఇండ్ల‌లో నివ‌సించే ప్ర‌జ‌లు ఈ విష‌యాన్నిగుర్తుంచుకోవాలి. లేకుంటే ప్ర‌మాదం పొంచే అవ‌కాశం ఉంది. ప్రాణ‌న‌ష్టాలు జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేదు. తాజాగా క‌ర్నాట‌క రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఓ కుటుంబం పాత‌కాలం నాటి ఇంట్లో నివాసం ఉండ‌డంతో ఆ ఇల్లు కూలి అక్క‌డిక‌క్క‌డే ఏడుగురు మంది మృత్యువాత‌ప‌డ్డారు.
క‌ర్నాట‌కలోని బెళ‌గావి జిల్లాలో ఈ విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా బ‌ద‌ల అంకాల‌గి గ్రామంలో ఓ ఇల్లు కూలిపోవ‌డంతో ఇంట్లో ఉన్న వారంద‌రూ మ‌ర‌ణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శిథిలావ‌స్థ‌కు చేరిన ఇల్లు కావ‌డంతో వ‌ర్షానికి నాని త‌డిసి కూలిపోయిన‌ట్టు పేర్కొంటున్నారు. ఈ విష‌యంపై స‌మాచారం తెలుసుకున్న క‌ర్నాట‌క‌ సీఎం  బ‌స‌వ‌రాజు బొమ్మె విచార‌క‌రని ప్ర‌క‌టించాడు. మృతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మృతి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ఒక్కొక్క‌రికి రూ.5ల‌క్ష‌ల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.
 ఆక‌స్మాత్తుగా ఉన్న‌ట్టుండి ఈ విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఆ గ్రామంలో విషాద‌చాయ‌లు నెల‌కొన్నాయి. ఒకేసారి ఏడుగురు మృతి చెందడం మామూలు విష‌యం కాదు. పురాత‌న‌మైన ఇండ్ల‌లో నివ‌సించే వారు ఇప్ప‌టికైనా మేల్కొని ఇల్లు మారాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. ఏక్ష‌ణంలో ఏమి జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఆర్థికంగా ఎలా ఉన్నా సొంత ఇల్లు క‌ట్టుకోవ‌డం ఉత్త‌మం.  పేద‌ల అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం క‌నీస అవ‌స‌రాలు తీర్చితే ఇలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌వు అని ప‌లువురు ప‌లువిధాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌భుత్వం సాయం అందించిన అందించ‌క‌పోయిన క‌నీస అవ‌స‌రాల్లో ఒక‌టైన ఇల్లు నిర్మించుకుంటే ఎంతో సేఫ్‌.  ఏది ఏమైనా పురాత‌న ఇండ్ల‌లో నివ‌సించ‌క‌పోవ‌డం ఎంతో బెట‌ర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: