తాలిబన్ల అరాచకం కనీసం గర్భవతిని కూడా వదిలిపెట్టలేదు.. ఏం..?

MOHAN BABU
 తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఆక్రమించిన అప్పటినుంచి ఆ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. కనీసం తినడానికి తిండి కూడా లేని దుర్భరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇక మహిళల విషయానికి వస్తే తాలిబన్లు వారిని చూసే విధానం, వారిపై పెట్టిన ఆంక్షలు అంతా ఇంతా కాదు. మహిళలంటే ఒక ఆట వస్తువు కంటే హీనంగా చూస్తున్నారు. కనీస విలువ కూడా ఇవ్వడం లేదు. 12 సంవత్సరాల అమ్మాయి నుంచి 40 సంవత్సరాల మహిళ వరకు కనీస బాధ్యత లేకుండా పోయింది. అక్కడి ఆఫ్ఘనిస్తాన్ మహిళలకే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన మహిళలు కూడా తాలిబన్ల చేతిలో బలవుతున్నారు. అయితే అమెరికా చెందినటువంటి గర్భస్థ మహిళ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ యొక్క విషయమును రిపబ్లికన్ కాంగ్రెస్మాన్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఆ యొక్క యువతి పేరు  నజ్రియా, ఆమె ఆఫ్ఘనిస్తాన్ లోనే అమెరికన్లు నివసిస్తున్న అటువంటి సమయంలో అక్కడే ఉండి పోయింది. ఇంతలో దేశం మొత్తాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆమె పారిపోయి  వారి సొంత దేశమైన అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంలోనే అక్కడి దారుణమైన పరిస్థితులను గుర్తు చేసుకొని తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అయితే నజియా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల చేతిలో తీవ్రంగా చిత్రహింసలు అనుభవించింది. యొక్క విషయాలను అమెరికా ఈ ప్రతినిధి అయిన ఐజాగ్ తెలియపరిచారు. గర్భంతో ఉన్నప్పుడు తాలిబన్లు అన్న కడుపుపై తన్ని పైశాచికానందం పొందారని, ఆఫ్ఘనిస్థాన్లో  తాలిబన్ల వశం అయిన తర్వాత అక్కడి అమెరికన్లను మరియు శరణార్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం అమెరికా చేసిన కృషి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలోనే నజ్రియాను కూడా తన సొంత దేశమైన అమెరికాకు చేర్చడంతో ఐజాక్ ఎంతో సహాయం చేశారని ఆమె చెప్పారు. అయితే ఆమె ఇన్ని అవస్థలు ఎదుర్కొన్నప్పటికీని  ఆమె ఒక్కతే అమెరికాకు రాగలిగారు. కానీ ఆమె యొక్క భర్త మాత్రం అక్కడే ఆఫ్ఘనిస్థాన్లో ఉండిపోయారు. అమెరికా చేసుకున్నటువంటి నజ్రియా అక్కడ తాలిబాన్లు చేసే టార్చర్ ను వివరించారు.

 తన భర్తతో  ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని నజ్రియా వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఎక్కువ ఉన్నటువంటి అభద్రతా భావనతో  ఆ దేశాన్ని తోటి స్వదేశానికి రాగలమా అని  అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నాకు ఒక్క దానికి మాత్రమే అమెరికా రావడానికి అనుమతి వచ్చింది. ఇప్పటికి నా భర్త  ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నారని నజ్రియా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై నజ్రియా మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా విమానం ఎక్కడం సాధారణ విషయం కాదని, దీని కోసం నేను, నా భర్త  చాలా రోజులు రోడ్లపై నిద్రపోయామని, ఆ సమయంలో కొంతమంది ప్రజలు రోడ్ల పై పడుకున్న వారి పైన తొక్కుకుంటూ ముందుకెళ్ళి పోయే వారిని, ఏది ఏమైనా అమెరికా వచ్చేశాను అని  నాతోపాటు నా భర్త కూడా బాగుండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: