ఆ వీడియోలు చూస్తే జైలుకు వెళ్లక తప్పదా..?

MOHAN BABU
 టెక్నాలజీ పెరిగినప్పటినుంచి ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వారు ఏది కావాలన్నా చూసేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఈ ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తూ ఉంటారు. అదే ఇప్పటి నుంచి ఎవరైనా పిల్లలతో కలిసి ఈ యొక్క వీడియోలు చూసినట్లయితే  జైలుకు వెళ్లడమే...? చిన్న పిల్లలతో ఫోర్న్ చిత్రాలను చూస్తూ ఉన్నారా..? అయితే మీరు జైలుకు వెళ్లడం కోసం  సిద్ధమై వుండండి.. మీరు ఎక్కడ ఉన్నా పోలీసులు వచ్చి పట్టుకు వెళ్తారు. వారిని తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడతారు.. నాలుగైదు సంవత్సరాలుగా మైనర్లతో చిత్రీకరించినటువంటి పోర్న్ వెబ్సైట్లను వీక్షించే వారి సంఖ్య పెరిగిపోవడంతో పోలీసులు అలర్ట్ అయిపోయారు.

దీని ప్రభావం వలన మైనర్ల లో అకృత్యాలు ఎక్కువగా పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ దీనిపై దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క వీడియోలు చూస్తున్న వారిని గుర్తిస్తున్నారు.  కంప్యూటర్లు మరియు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లలో వారి యొక్క ఐపి చిరునామాలు ద్వారా వారిని గుర్తించి వారు ఎవరనేది ఆయా రాష్ట్రాలకు సమాచారం వెళుతుంది. దేశం మొత్తంలో ఈ ఏడాది దాదాపు 1095 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామాల నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు ఈ యొక్క వెబ్ సైట్ లో చూస్తున్న వారిని గుర్తించడం కోసం ఈ బ్యూరో సీ సము అనే అమెరికాకు చెందిన కంపెనీతో నాలుగేళ్ల క్రితం ఒక ఒప్పందం కుదుర్చుకున్నది.

ఈ యొక్క సంస్థ ఇస్తున్న వివరాలతో పాటు అదనముగా కేరళ,  మహారాష్ట్ర  వంటి వాటిని ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి జైలుకు పంపుతున్నారు.  ఇందులో మొదటి సారి దొరికిన వారికి ఐదు సంవత్సరాలు, రెండవసారి దొరికిన వారికి  ఏడు సంవత్సరాలు జైలు మరియు  10 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు. మన హైదరాబాద్ నగరంలోనే 2 సంవత్సరాల క్రితం 16 కేసులు నమోదవగా, ఇందులో ఒక ముగ్గురిని సైబర్ క్రైమ్ బ్రాంచ్ కి చెందిన పోలీస్ అరెస్ట్ చేశారు. ఇందులో కూడా ముగ్గురిపై రెండోసారి కేసు నమోదు అవ్వడం చూస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: