నిందితుడు రాజు పచ్చబొట్టు వెనుక రహస్యం ఏమిటి..?

MOHAN BABU
 సమాజం మారింది. మనిషి యొక్క బుద్ధులు కూడా మారుతున్నాయి. పుట్టిన పిల్లల నుంచి ముసలి తల్లి వరకు భద్రత అనేది లేకుండా పోతోంది. మనుషుల్లో మానవత్వం అనే భావన చచ్చిపోతుంది. మనిషి మృగం లా మారి ఇలాంటి ఘటనలకు ఒడిగడుతున్నారు. అసలు మనిషి ఎందుకిలా మారుతున్నారు..? అభం శుభం తెలియని చిన్నారి చైత్ర  ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు  ఎంతో చలాకీగా తన తోటి పిల్లలతో ఆడుకుంటూ గడిపేది. అలాంటి  చైత్ర అంతలోనే మాయమై పోయింది. ఆ కామాంధుడి కబంధహస్తాల్లో ఆమె జీవితం ఒక కాల రాత్రిలా ముగిసింది. ముక్కుపచ్చలారని  ఆ చిన్నారి బతుకు ఈ మృగాడి చేతిలో ముగిసిపోయింది. ఆ చిన్నారి బిడ్డ  ఎంతటి చిత్రహింసలు అనుభవించిందో..?  ఎంతటి  బాధను భరించిందో..? ఈ దుర్మార్గుడి  చేతిలో బలైపోయింది..?

అయితే  దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతోమంది చైత్రల జీవితాలు ఇలాంటి కామ పిశాచాల చేతిలో కాలం చెల్లుతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది..! దీనికి కారణం ప్రభుత్వమా.. లేదా ప్రజలా అనేది మనం గమనించుకోవాలి. మనకు తెలిసిన ఈ యొక్క చైత్ర జీవితం ఇలా ముగిసిపోతేనే మనం ఎంతో బాధ పడుతున్నాము. ఇలా దేశంలో  రోజు ఎంతో మంది  చిన్నారులు చిదిమేయడుతున్నారు. ఇందులో కనీసం 10 శాతం మంది కూడా బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకిలా జరుగుతోంది ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదా. ఒకవేళ బయటకు వచ్చినా  న్యాయం జరుగుతుందా.. అనే ఆలోచనలతో ఎంతోమంది చెప్పకుండానే ఎంతో మంది నిందితులు శిక్షల నుండి తప్పించుకుంటున్నారు..? చైత్ర ఘటనలో  నిందితుడు దాదాపు వారం పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి వాడి తలపై పది లక్షల రివార్డులు కూడా పోలీస్ శాఖ ప్రకటించింది. వాడిని కనిపిస్తే ఎన్కౌంటర్ చేయమని కూడా ఆర్డర్స్ జారీ చేసింది.. చివరికి ఆ దుర్మార్గుడు రైలు కిందపడి తనకు తానే ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే..?

ఈ ప్రమాదంలో  రాజు శరీరమంతా నుజ్జు నుజ్జు  అయిపోయింది. అతను రాజు అని పోలీసులు అతని చేతికున్న పచ్చబొట్టు ద్వారానే కనిపెట్టగలిగరాని  చెప్పవచ్చు.  అసలు రాజు పచ్చబొట్టు వెనుక ఉన్న రహస్యం ఏమిటి..? రాజు ఎవరు..? నిందితుడైన రాజు అసలు ఊరు జనగామ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన వ్యక్తి. అతనికి 2 సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లా లోని జమలపురం గ్రామానికి చెందిన మౌనిక అనే యువతితో పెళ్లి జరిగింది. అయితే తనకు ఎంతో ఇష్టమైన తన భార్య పేరును  తన చేతులపై ఇంగ్లీష్ మరియు తెలుగులో పచ్చబొట్టు వేయించుకున్నాడు. అయితే తన భార్య ప్రసవంకోసం అని ఏడాది క్రితమే తన పుట్టింటికి వెళ్ళింది. ఇంతలో నిందితుడు  రాజు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి చివరికి  ట్రైన్ కింద చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: