హైద‌రాబాద్ లో బాలుడిపై లైంగిక వేధింపులు..ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష‌..!

MADDIBOINA AJAY KUMAR
లైంగిక వేధింపులు మ‌హిళ‌ల‌కు మాత్రమే కాదు పురుషుల‌కు కూడా ఎదుర‌వుతూనే ఉన్నాయి. అయితే పురుషుల‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల పెద్ద‌గా వెలుగులోకి రావు. ఎందుకంటే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న పురుషులు ఫిర్యాదు చేసేందుకు కూడా పెద్ద‌గా ముందుకు రారు. మ‌రోవైపు సమాజానికి భ‌య‌పడి కూడా తాము లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నాం...అని ఫిర్యాదు చేయ‌కుండా ఉండిపోతారు. ఒక వేళ ఫిర్యాదు చేసినా పోలీసులు ప‌ట్టించుకోరరేమో...లేదంటే అస‌లు పురుషుల కోస చ‌ట్టాలు ఉన్నాయా అని భ‌య‌ప‌డిపోతుంటారు. అయితే పురుషుల్లో మైన‌ర్ ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డితే మాత్రం క‌ఠిన చ‌ట్టాలు ఉంటాయ‌ని తాజా ఘ‌ట‌న చూస్తే అర్థం అవుతోంది. 

వివ‌రాల్లోకి వెళితే.... ఓ బాలుడిని లైంగికంగా వేధించిన ఘ‌ట‌న‌లో మ‌హిళ‌ల‌కు క‌ఠిన శిక్ష‌ను కోర్టు విధించింది. 2017 లో ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో ఆయాగా ప‌నిచేస్తున్న 25 ఏళ్ల‌ యువ‌తి అదే పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డో జ‌ర‌గ‌లేదు.... మ‌న హైద‌రాబాద్ లోని పాత బ‌స్తీలోనే చోటు చేసుకుంది. అయితే 2017 లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో ఎట్ట‌కేల‌కు నింధితురాలికి కోర్టు శిక్ష‌ను విధించింది. త‌నను ఆయా లైంగిక వేధింపుల‌కు గురి చేస్తుందంటూ బాలుడు త‌ల్లి దండ్రుల‌కు చెప్ప‌డంతో వాళ్లు స్కూల్ ప్రిన్సిప‌ల్ తో పాటు చాంద్నారాయ‌ణ గుట్ట‌ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.

ఇక 2017 లో బాధితుడి త‌ల్లిదండ్ర‌ల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకోగా ఇప్ప‌టికి బాధితుల‌కు న్యాయం జ‌రింగింది. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రిపారు. నింధితురాలిపై ఫోక్సో చ‌ట్టం కింద అభియోగాలు మోపిన పోలీసులు కోర్టుకు త‌గిన ఆధారాల‌ను స‌మ‌ర్పించారు. ఇక ఈ కేసును విచారించిన బాల‌మిత్ర కోర్టు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించి...రూ.10వేల రూపాయాల జ‌రినామా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: