సైదాబాద్‌ నిందితుడు రాష్ట్రం దాటేశాడా ?

Veldandi Saikiran
హైదరాబాద్‌ లోని  సైదాబాద్ నిందితుడు రాజు కోసం పోలీసు వారు భారీ సెర్చ్ ఆపరేషన్  చేస్తున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్‌..  నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండటం తో..  తెలంగాణ రాష్ట్రం లోని 2200 మద్యం షాపు యజమానుల ను అప్రమత్తం చేశారు పోలీసులు..  ప్రతి వైన్ షాప్ కి రాజు కి  సంబంధించిన ఫోటో వివరాలు పంపించారు పోలీసులు.. 

అంతే కాదు.. తెలంగాణ రాష్ట్రం లోని కల్లు కంపౌండ్ లో సిబ్బందిని అప్రమత్తం చేశారు అధికారులు.. అన్ని కల్లు కాంపౌండ్లో వద్ద నిఘా పెంచారు అధికారులు..  హైదరాబాద్‌ లోని కూలీల ఆడ్డ  వద్ద నిఘా పెంచారు అధికారులు.  వంద మంది కి పైగా వ్యభిచారుల ను ప్రశ్నించారు అధికారులు. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీ లో సెర్చింగ్ చేస్తు న్నారు పోలీసు అధికారులు. వేలకొద్దీ సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్న అధికారులు....  చివరకు చివరగా ఉప్పల్లో కనబడ్డాడు రాజు.  ఉప్పల్ నుంచి ఇతర జిల్లా లకు వెళ్లే అన్ని బస్సు  రూటు కండక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు అధికారులు.

  తెలంగాణ రాష్ట్రం లోని అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది ని అప్రమత్తం చేశారు అధికారులు. జాతీయ రహదారు లతో పాటు స్టేట్ రోడ్ లో తనిఖీలు ముమ్మరం చేశానే అధికారులు. రాజు ఫోటోలు చూపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.  అయితే...  ఆ నిందితుడు తెలంగాణ రాష్ట్రం దాటి..  పక్క రాష్ట్రాలకు వెళ్లాడా ? అనే కోణం లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, ముంబై మరియు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బార్డర్లలో ముమ్మర తనీఖీలు చేస్తున్నారు అధికారులు.  ఒకటి లేదా రెండు రోజుల్లో నిందితుడు రాజును పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు ఉన్నతా అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: