ఆమెకు ఫోన్ చేసి రాత్రికి రేటు ఎంత అని అడుగుతున్నారు.. ఎందుకు..?

MOHAN BABU
 ఆమెకు  ఫోన్ చేస్తున్నారు రాత్రికి రేటెంత అని కూడా అడుగుతున్నారు. అలాగని ఈమె ఇదో కాల్ గర్ల్ అనుకునేరు, అస్సలు కాదు, మరి ఆమెకి ఎందుకు ఫోన్ చేస్తున్నారని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదూ. కాని దాని వెనుక పెద్ద ఆంతర్యం ఉంది. అదేమిటో తెలుసుకుందామా..? అతను ముంబై నగరానికి చెందిన ఒక బిజినెస్ మ్యాన్. అతని పేరు దిలీప్ జాయిన్. అతను 3 సంవత్సరాల క్రితం  విరారుకు చెందినటువంటి ఒక మహిళతో  సంబంధం ఏర్పరుచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరు విడిపోయారు. కానీ సదరు వ్యాపారవేత్త మాత్రం  ఆ మహిళ ఇంకా వేధిస్తూనే ఉన్నారు. ఎంతలా అంటే  ఆ మహిళ పోలీస్ కేసులు పెట్టిన పట్టించుకోకుండా ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూన్నాడు. ఆమెతో విడిపోగానే  ఆ మహిళ పరువు తీయాలి అని అనుకున్నాడు. ఆమె యొక్క నగ్న చిత్రాలను, నగ్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి, వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాడు ఆ బిజినెస్ మ్యాన్. ఇదే సమయంలో సదరు బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది.

దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా సదరు మహిళను అలాగే ఆమె కుటుంబ సభ్యులను కూడా దిలీప్ వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. గత ఏడాది కాలంలో సదరు బాధిత మహిళకు 65000 ఫోన్ కాల్స్ చేశాడంటే  ఆ మహిళను ఎంతగా  ఇబ్బంది చేస్తున్నాడో  మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతోపాటుగా  ఫేక్ పేస్ బుక్, ఇంస్టాగ్రామ్  ఇలాంటి అకౌంట్ ను కూడా క్రియేట్ చేసి సదరు మహిళ ఫోటోలను అందులో పెట్టి  కాల్ గర్ల్ అనే ట్యాగులు తగిలించి  దారుణానికి ఒడిగట్టాడు. అలాగే ఆ మహిళ నెంబర్ ను కూడా చాలామందికి పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో సదరు బాధిత మహిళ స్పందించి తనను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నా నెంబర్ ను కాల్ గర్ల్ గా క్రియేట్ చేశాడని 29 ఏండ్ల  మహిళ ఫిబ్రవరి 29వ తేదీన  ఈ యొక్క ఫేక్ ఫోటోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు దిలీప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఎలాగైనా ఫేక్ అకౌంట్ లను డిలీట్ చేయించాలని ఆ మహిళ పోలీసులను కోరింది. తన నెంబర్ ను కాల్ గర్ల్ గా పోస్ట్ చేయడం ద్వారా చాలా మంది నాకు ఫోన్ చేసి చాలా నీచంగా మాట్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రికి రేటెంత అడుగు తున్నారని, మెసేజ్ లు కూడా పెట్టి  ఎంత తీసుకుంటావు అని అంటున్నారని ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని ఆ మహిళ బాధతో పోలీసులకు చెప్పింది. దీంతో సదరు దిలీప్ పై పోలీసులు 8 ఎఫ్ ఐ ఆర్   కేసులు నమోదు చేశారు. అయినా దిలీప్ ఆ మహిళను వేధించడం ఆపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: