నవదీప్ ఈడీ విచారణలో నమ్మలేని నిజాలు.. ఏమిటి..?

MOHAN BABU
గత కొద్ది రోజుల నుంచి మత్తుపదార్థాల వ్యవహారంలో  సినీ నటులను ఒక్కొక్కరుగా ఈడీ విచారణ చేస్తోంది. వీరు చేసినటువంటి పనులపై, వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లపై, పూర్తి సమాచారాన్ని తీసుకుంటోంది. ఇప్పటికే రవితేజ, రానా లాంటి ప్రముఖ హీరోలు ఈడీ విచారణలో ఉన్నారు. ఈ సినీ నటుల నుంచి డ్రగ్స్  సంబంధించి ఏ విధంగా సరఫరా అయ్యేది, ఎవరు చేశారు. దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనే కోణంలో చాలా రోజుల నుంచి వీరిని ఈడి అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా కొన్ని రోజులు రవితేజ అదుపులోకి తీసుకొని విచారించారు. మళ్లీ రానాను కూడా  అదుపులోకి తీసుకొని వారిపై విచారణ చేపడుతున్నారు.

ఈడీ అధికారులు  వారి యొక్క కార్యక్రమాలపై పూర్తిగా కన్నేసి వారి పై దృష్టి సారించి ఈ విచారణ చేపడుతూ  నిజాలు లాగే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, నితిన్ లాంటి హీరోలను ఈడి అధికారులు విచారించారు. ప్రస్తుతం వీరి దర్యాప్తులో నవదీప్ హీరో ఉన్నారు. ఈయనను ఈడి అధికారులు చాలా కోణాల్లో విచారిస్తున్నారు.  నవదీప్ , ఎఫ్ లాంజ్ పబ్బు మేనేజర్ ని కలిపి విచారిస్తున్న ఈడీ అధికారులు. అలాగే 2015 నుంచి 2017 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఎఫ్ లాంజ్ పబ్బు పార్టీల నిర్వహణపై ఈడి అధికారులు ఆరా తీస్తున్నారు.  పబ్బులో జరిగిన పార్టీలకు ఏ ఏ  నటీనటులు హాజరయ్యారు.  ఈ పబ్ లో జరిగినటువంటి పార్టీలకు ముందు తర్వాత పెద్ద ఎత్తున క్లబ్ అకౌంట్ లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయని కోణంలో నవదీప్ ను ప్రశ్నిస్తున్నారు. కొంతమంది నటి నటులు పెద్ద ఎత్తున క్లబ్బు మేనేజర్ కి డబ్బులు బదిలీ చేసినట్లు గుర్తించారు ఈడి అధికారులు.

మూడేళ్ల కాలంలో 30 పైగా పార్టీలు జరిగినట్టుగా గుర్తించారు. దీంతోపాటుగా  కెల్విన్ మరియు నవదీప్ లు కలిసి పార్టీల సంబంధించిన ఈ వ్యవహారాన్ని నడిపినట్టుగా ఈడి విచారణలో బయట పడింది.  ఇందులో ఎఫ్ లాంజ్ పబ్బు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్  కీలకంగా మారాయి.  ఎఫ్ లాంజ్ పబ్బు బ్యాంకు అకౌంట్ లోకి భారీగా నిధుల వరద ఏ విధంగా వచ్చింది.  కెల్విన్ , పీటర్, కమింగ్ అకౌంట్లకు భారీగా ఎఫ్ లాంజ్ పబ్బు నుంచి నిధులు బదలాయింపు ఏ విధంగా జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు నవదీప్ ను విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: