బాబోయ్ బంగారం అక్కడ కూడా పెట్టుకుంటారా...!

Podili Ravindranath
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేయడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. ఎలాగైనా సరే కోట్ల రూపాయల విలువైన బంగారం దొంగచాటుగా తెచ్చేస్తున్నారు. బిస్కెట్ల రూపంలో కొందరు.... నగల రూపంలో కొందరు... ఇప్పుడు కొత్తగా పేస్టులా తయారు చేసి మరీ తీసుకు వచ్చేస్తున్నారు కూడా. అదేదో సినిమాలో హీరో సూర్య వజ్రాలు తెచ్చినట్లుగా... శరీరావయాల్లో దాచుకుని మరీ తెచ్చేస్తున్నారు. ఆడవారు అయితే లో దుస్తుల్లో కూడా పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేసేస్తున్నారు. ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. అయినా సరే... అక్రమార్కులు మాత్రం కొత్త దారులు వెతుకుని మరీ రవాణా చేసేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారు అనుసరిస్తున్న విధానం చూసి నోరెళ్లబెట్టారు కూడా.
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను తనిఖీ చేయగా... వారి వద్ద ఏకంగా కేజీ బంగారం గుర్తించారు పోలీసులు. అది కూడా ఎలా తెస్తున్నారో తెలుసా... నోటీలో పెట్టుకుని... అవాక్కయ్యారా... అవును నిజమే... ఒక్కొక్కరి నోటీలో దాదాపు 470 గ్రాముల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఇద్దరి దగ్గర కలిసి 951 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు... వీరిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అంత బంగారం నోటీలో ఎలా పెట్టుకున్నార్రా నాయానా అని పోలీసులే నోరెళ్లబెడుతున్నారు. పేస్టు రూపంలో మార్చి... దానిని పళ్లపైన్ కోటింగ్ చేసారు. అలాగే చిన్ని చిన్న కడ్డీలుగా మార్చేసి... అవి కూడా పళ్లకు లోపలి వైపు నాలుక కింద నీట్‌గా సెట్టింగ్ చేశారు. దూరం నుంచి చూస్తే ఏ మాత్రం అనుమానం రాకుండా సాధారణంగానే ఉండేలా మేకప్ వేశారు. కానీ నోరు తెరిస్తే మాత్రం ఒక్కొక్కరి నోటి నుంచి ఏకంగా అరకేజీ బంగారం బయటకు తీశారు పోలీసులు. ఇంత జరిగినా కూడా అసలు సూత్రధారులు మాత్రం బయటకు రావటం లేదు. చూడాలి తేలు కుట్టిన దొంగలు ఎంత కాలం తప్పించుకుంటారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: