పదేళ్లలో పాతిక మంది భర్తలు !

Vennelakanti Sreedhar
పదేళ్లలో పాతిక మంది భర్తలు !
ఇదో భార్య బాధితుడు గాథ... కాదు, కాదు భార్యా విధేయుడి  గాథ....  అలా కాదు భార్యపై అలవికాని ప్రేమను కలిగిన వ్యక్తి కథ....ఎలా అనుకోవాలి?. ఇక అసలు విషయానికి వద్దాం... అస్సాంకి చెందిన మధ్యవస్కురాలైన మహిళ పదేళ్ల కాలంలో పాతిక మందితో వెళ్లి కొంత కాలం సహజీవం చేసివచ్చేది. ఆమె తిరిగి తన మొదటి భర్త దగ్గరకు వచ్చిన ప్రతి సారి అతను ఆమెను సాదరంగా జీవితంలోకి అహ్వనించారు. భర్తే కాదండోయ్ భర్త  తల్లితండ్రులు కూడా ఆమెను తమ జీవితాలలోకి ఆహ్వనించారు. ఇందుకు కారణం ఆమె కు ముగ్గరు పిల్లలు. పిల్లల  కోసం వారు మరలా మరలా అమెను తమ కుటుంబంలోకి ఆహ్వనించారు. ఎప్పడు కూడా ఆమెపై  సీరియస్ కేసు పెట్టలేదు. ఆ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది.
మధ్య అస్సాం రాష్ట్రంలోని నాగాన్ జిల్లాలో మారు మూల గ్రామం దింగ్ లఖర్. ఆ గ్రామానికి చెందిన మఫిజుద్దీన్ వృత్తి రీత్యా డ్రైవర్. "నాకు 2011 లో వివాహమైంది. ఈ పదేళ్లలో నా భార్య ఇరవై అయిదు సార్లు ఇంటిలో నుంచి వెళ్లి పోయింది.  తిరిగి వచ్చిన ప్రతిసారి క్షమాపణలు చెప్పేది. ఎన్నో బాసలు చేసేది.  నాతోనే ఉంటానని ప్రమాణాలు చేసేది. నాకు ముగ్గురు పిల్లలు, వారి భవిష్యత్తు దృష్ట్యా ఆమెను  ప్రతిసారి జీవితంలోకి ఆహ్వానించాం. ఆమె ఎప్పుడు కూడా తన మాట నిలబెెట్టుకోలేదు." అని మఫీజుద్దీన్ తనను కలసిన విలేఖరుల వద్ద వాపోయారు. కొన్ని సార్లు నా భర్య బంధునుల ఇంటికి వెళ్లానని చెప్పేది, మరికొన్ని మార్ల బంధువులను చూసిరావాలని చెప్పి ఇల్లు విడిచి వెళ్లేది. ఈ శనివారం అంటె సెప్టెంబర్ 4వ తేది నేను డ్రైవింగ్ వృత్తి  ముగించుకుని వచ్చే సరికి మానాన్న ఎదురొచ్చి  నీ భార్య మరలా వెళ్లిపోయిందని చెప్పాడు. ఈ సారి ఆమె తన మూడు నెలల చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. అని మఫీజుద్దీన్ వాపాయారు.
ఒక ప్రత్యేక సామాజిక వర్గం  జనాభా అత్యధికంగా గలమారు మూల గ్రామం దింగ్ లఖర్.  ఆ ఉరి వాసులు ఆమె గురించి  చాలా విషయాలు మీడియాకు  తెలిపారు. చాలా మందితో ఆమెకు ప్రేమపూర్వక సంబంధాలున్నాయని  పేర్కోన్నారు. కొద్ది రోజులు, వారాలు, నెలలు తర్వాత ఆమె తన అత్తమామల ఇంటికి రావడం మామూలేనని ఇదేమి పెద్ద విషయం కాదని  చెప్పారు. తన పెద్ద కూతురి వయస్సు ఆరు సంవత్సరాలు, రెండో కుమారుడి వయస్సు మూడు సంవత్సరాలు, ప్రస్తుతం మూడు నెలల మగబిడ్డ.  చంటి బిడ్డను వదలి వెళ్లడం తనను బాధించిందని మఫీజుద్దీన్ వాపోయారు. ఇప్పటి వరకూ బిడ్డల భవితను దృష్టిలో పెట్టుకొని పోలీసులకు తెలప లేదని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోనేందకు తన స్తోమత సరిపోదన్నారు. ఆ కారణంగా ఇంత వరకూ ఈ విషయం పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. తనకు సహనం నశించి ఈ విషయం మీడియాకు తెలిపానని మఫీజుద్దీన్ వివరీంచారు.  దీంతో ఈ విషయం అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా వైరల్ అవుతోంది.సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: