ఆడపిల్లని లిఫ్ట్ ఇచ్చిన పాపానికి... అతనినే ?

VAMSI
మారుతున్న ఈ సమాజములో రోజు రోజుకీ నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ధనార్జనే లక్ష్యంగా చేసుకున్న కొందరు ఏ పని చేయడానికి అయినా సిద్దపడుతున్నారు. ఇలాంటి కేటుగాళ్లలో ఆడవాళ్లు కూడా ఉండడం సమాజము సిగ్గు పడాల్సిన విషయం. తాజాగా జరిగిన ఒక ఘటనే ఇందుకు ఉదాహరణ. ఒక ఫైనాన్స్ వ్యాపారి చింత సత్యనారాయణ తన పనులు ముగించుకుని విజయనగరం నుండి గజపతి నగరం వైపు ఒంటరిగా బైక్ లో ఇంటికి వెళుతున్నాడు. అయితే మార్గ మధ్యంలో గొట్లం దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమెకు దాదాపుగా 25 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది. లిఫ్ట్ అడిగింది. సత్యనారాయణ మానవతా దృక్పధంతో అలోచించి పాపం ఒంటరిగా ఉన్న అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.
అయితే వీరు వెళుతున్న మార్గంలో ఆ సమయంలో రోడ్లపై ఎవ్వరూ లేరు. కొంచెం దూరం వెళ్ళగానే సరిగ్గా గజపతి నగరం బ్రిడ్జి దావాలపేట రోడ్డు దగ్గర ఆ అమ్మాయి ఇక్కడ ఆపండి అని బైక్ దిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. దిగిన అమ్మాయి అక్కడ ఎవ్వరూ లేనిదీ గమనించి వెంటనే సత్యనారాయణ మెడలో ఉన్న బంగారు చైన్ ను లాక్కుని పారి పోయింది. అయితే ఈ ఘటనను ఊహించని సత్యనారాయణ వెంటనే అరుపులు కేకలు పెట్టాడు. ఇది విన్న స్థానికులు పరుగున వెళ్లి ఆ దొంగ అమ్మాయిని పట్టుకున్నారు. సత్యనారాయణ తృటిలో తన బంగారాన్ని కోల్పోయేవాడు. కానీ పక్కన వారి సహాయంతో మళ్ళీ చైన్ ను పొందగలిగాడు. ఈ ఘటన విజయనగర్ జిల్లా గజపతినగరం పరిధిలో జరిగింది.
ఈ కేసును ఫైల్ చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె పేరు సామంతుల లక్ష్మి అని ఆమె దొంగతనానికి పాల్పడం ఇదే మొదటి సారి కాదని పోలీసులు తెలుసుకున్నారు. ఇంతకు ముందు ఒక చైన్ దొంగతనం కేసులో నిందితురాలు అని తెలిసింది. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూశారా... పోనీలే ఆడపిల్ల అని జాలిపడి లైఫ్ ఇచ్చినందుకు అతని చైన్ నే దొంగతనం చేయాలని చూసింది. కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించండి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: