ఎంత దారుణం

Vennelakanti Sreedhar
ఎంత దారుణం

మానవ సమాజం తలదించుకునే సంఘటన. నోరు లేని మూగ జీవాలపై మానవ మృగాలు జరిపిన మారణ కాండ. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలో జరిగింది.  ఆ జిల్లా ఎస్.పి. లక్షీ ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రావతి తాలూకాలో పరిధిలోని కంబడలు-హోసూరు గ్రామ పంచాయతీ అధికారులు మానవ మృగాల్లా ప్రవర్తించారు.

 అత్యంత విశ్వాసం కలిగిన జంతువు, పెంపుడు జంతువు  కుక్క.  ఈ అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా  పెంపుడు జంతువులకు విషం పెట్టి చంపారు. అంతటితో ఆగవ వాటిని తీసుకువేళ్లి కాల్చారు.  ఈ విషయం గ్రామంలో ఎవరికీ తెలయకుండా తమ పని పూర్తి చేశారు. నిజం బైటికి రాకుండా ఉంటుందా...సమాచారం అందుకున్న గ్రామస్తులు జిల్లా కేంద్రానికి సమాచారం అందించారు. 

దీంతో జంతు పరిరక్షకుల సంఘం సభ్యులు  జిల్లా అధికారులతో కలసి గ్రామాన్ని సందర్శించారు. పశువైద్యులు, గ్రామస్తుల సహకారంతో ఘటనా స్థలంలోని భూమిని తవ్వారు. అక్కడ నుంచి  కుక్కల మృత కళేబరాలను వెలికి తీశారు.  తవ్వే కొద్దీ ఒక్కోక్కటిగా అవశేషాలు బైట పడుతుండంతో పశువైద్యలు నివ్వెర పోయారు. ఘటనా  స్థలంలో తాము పరిశీలించిన విషయాన్ని జిల్లా అధికారులకు నివేదించారు. ఈ ఘటన తనను నిర్ఘాంత పరచిందని ఎస్.పి.లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.

 అనుభవం కలిగిన పశువైద్యుల బృందం మరోసారి ఘటనా స్థలాన్ని సందర్శించి నివేదిక ఇస్తుందన్నారు. కుక్కలకు విషం ఇచ్చి చంపడం, ఆపై కల్చడం అమానుష చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన మానవ సమాజం తలదించుకునే ఉందన్నారు.  పంచాయతి అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. దాదాపు వందకు పైగా కుక్కలు మృతి చెందాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.వందకు పైగా కుక్కలు ఏం పాపం చేశాయని వాపోయారు. ఆ ఘటనకు బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: