చ‌దివింది ఏడు.. మోసమే పెట్టుబ‌డి.. 1200 కోట్ల‌కు టోపి !

Paloji Vinay
    త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బులు ఆశ చూపించి జ‌నాల‌ను నిండా ముంచుతున్న కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవ‌ల క‌ర‌క్కాయ‌ల పొడి పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న మల్లికార్జున్ వ్యవహారం ఇంకా ముగియ‌క‌ముందే.  అలాంటిదే మరో మోసం భాగ్య‌న‌గ‌రంలో బోటు చేసుకుంది. తక్కువ కాలంలో వేలల్లో ఆదాయం వస్తుండటంతో ఆశ ఎక్కువై వెనుకా ముందు ఆలోచించ‌కుండా అందులో చేరారు. 


ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ సంస్థ సీఎండీ రాధేశ్యామ్‌ చేస్తున్న వ్యాపారంపై అనుమానం వ‌చ్చిన 10 రోజుల కిందట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు  ఓ వ్య‌క్తి .  ఈ ఫిర్యాదుతో మోస‌గాఇ వ్యవహారం బ‌హిర్గతం అయింది. అయితే, డ‌బ్బుల సంపాదించ‌డానికి చ‌దువు అవ‌స‌రం లేద‌ని నిరూపిస్తూ అత‌ను చదివింది ఏడో త‌ర‌గ‌తే అయినే మోసం చేయ‌డంలో పీహెచ్‌డీ చేశాడు. ల‌క్ష‌ల మందిని మోసం చేసి సుమారు రూ.1200 కోట్లకు టోక‌రా వేశాడు.

    ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌కేర్ పేరుతో ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీనీ ప్రారంభించాడు హరియాణా రాష్ట్రానికి చెందిన రాధేశ్యామ్, అతడి అనుచరుడు సురేందర్ సింగ్‌. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అందిన ఫిర్యాదు తో రాధేశ్యామ్ ను హెద‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. అత‌ని పేరుతో ఉన్న వివిధ బ్యాంకులోని రూ.218 కోట్ల‌ను జ‌ప్తు చేశారు పోలీసులు.  ఈ కిలాడి మూడు సంవ‌త్స‌రాల‌లో 20 ల‌క్ష‌ల మందికి పైగా మోసం చేశాడు. ఇందులో 15 వేల మంది తెలంగాణ వారు ఉన్నారు. శుక్ర‌వారం రాత్రి గురుగ్రామ్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు. రాధేశ్యామ్‌, సురేంద‌ర్‌ల‌ను కోర్టు అనుమ‌తితో క‌స్టీడికి తీసుకున్నారు.
 
   ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్న రాధేశ్యామ్ తొలుత చిన్న‌, చిన్న సంస్థ‌ల్లో విధులు నిర్వ‌హించాడు. త‌రువాత ఢిల్లికి మాకాం మార్చి గొలుసుక‌ట్టు ప‌థ‌కాల పేరుతో మోసాలు చేస్తున్న ఆర్సీఎం అనే కంపెనీలో చేరాడు రాధేశ్యామ్‌. త‌రువాత అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల‌ను మొత్తం తెలుసుకుని తిరిగి త‌న సొంత ఊరు హిస్తార్ కు వెళ్లి అక్క‌డే ఫ్యూచ‌ర్‌మేక‌ర్ లైఫ్ కేర్ గ్లోబ‌ల్ మార్కెటింగ్ కంపెనీనీ పెట్టాడు. త‌రువాత ఇత‌ర రాష్ట్రాల్లోనూ స్థాపించి వంద‌ల కోట్ల‌ను ఆర్జించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: