బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు !

Veldandi Saikiran
ఈశాన్య రాష్ట్రమైన అస్సాం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మపుత్ర  నదిలో ప్రయాణికులతో బయలుదేరిన రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు పడవలు... బోల్తా కొట్టాయి. అయితే ఈ దారుణమైన సంఘటన లో దాదాపు 100 మందికి పైగా ఆ నీటిలో గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన అస్సాంలోని జోర్హతి జిల్లాలో జరిగింది. మజ్లు నుంచి... నీ మాటి ఘాట్ కు వస్తున్న ఓ పడవ... తిరుగు ప్రయాణం చేస్తోన్న నేపథ్యంలో రెండు పడవలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. 

ఈ రెండు పడవల్లో ఏకంగా వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ రెండు పడవలు బోల్తా పడడంతో కొంతమంది ప్రయాణికులు... ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశారు. అందులో ఈత వచ్చిన వారు మాత్రమే వొడ్డుకు విజయవంతంగా చేయగలిగారు.  కానీ ఈత రాని వారు మాత్రం... గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. అయితే ఆ గల్లంతైన వారు... ఆ నీటి ప్రవాహం... ఇటు వస్తే అటువైపుగా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇంకా ఈ దారుణమైన ఘటన సమాచారం తెలియగానే.. జాతీయ మరియు  రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనా స్థలాని కి చేరుకున్న జాతీయ మరియు రాష్ట్ర విపత్తు స్పందన దళాలు... సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నీటి లో గల్లం తైన ప్రయాణికు లను... వెతికే పని లో పడ్డాయి భద్రత దళాలు. అయితే ఘటన తెలుసుకున్న... కేంద్ర షిప్పింగ్ మరియు ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనీ వాల్... దిగ్భ్రాంతి కి గురయ్యారు. ఈ ఘటనకు కారణాలు మరియు స హాయక చర్యల పై  అస్సాం రాష్ట్ర ముఖ్య మంత్రి హిమంత విశ్వ శర్మ ను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం గడ్డం ఆ స్థలం లో సహాయక చర్యలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: