ఆన్‌లైన్‌లో అలా చేయ‌మ‌న్న భ‌ర్త‌.. చివ‌రికి ఏమైందంటే.?

Paloji Vinay
ఓ మంచి అమ్మాయిని ఎన్నారైకి ఇచ్చి పెళ్లిచేశారు ఆమె త‌ల్లిదండ్రులు. కానీ యువ‌కుడు ప‌చ్చి తాగుబోతు శోభ‌నం రోజే ఫుల్లుగా తాగి రావ‌డంతో షాక్ గురైంది అమ్మాయి. ఇలా ప్ర‌తి రోజు పీక‌ల దాక మ‌ద్యం సేవించి వ‌చ్చి భార్యకు న‌ర‌కం చూపెట్టేవాడు. అశ్లీల వీడియోలు చూపిస్తూ.. అందులో ఉన్న‌ట్టు చేయాల‌ని ఆమె హింసించే వాడు. పెళ్లి జ‌రిగిన కొన్ని రోజుల త‌రువాత చెప్పాపెట్ట‌కుండా విదేశాల‌కు వెళ్లిపోయాడు అత‌డు. టార్చర్ త‌ప్పింద‌ని అనుకుంది అమ్మాయి కానీ అత‌డు ఫారిన్ నుంచి త‌న భార్య‌కు వీడియోకాల్ చేసి ఆన్‌లైన్ డేటింగ్ చేయాల‌ని న‌గ్నంగా డ్యాన్స్ చేసి చూపాల‌ని భార్య‌పై ఒత్తి తీసుకొచ్చేవాడు. దీనికి ఆ అమ్మాయి స‌సేమీరా అని చెప్పింది.

  భ‌ర్త‌కు తోడుగా త‌న అత్త మామ కూడా ఆమెకు టార్చ‌ర్ చూప‌డం మొద‌లెట్టారు. కొడుకు ఎలా చెబితే అలా వినాల‌ని.. భ‌ర్త వీడియోకాల్ చేసిన‌ప్పుడు అత‌డు చెప్పిన‌ట్టుగా న‌గ్నంగా ఉండి ఏం చెబితే అది చేయాల‌ని  హుకూం జారీ చేశారు. అంతే కాకుండా ఆమె పై దాడి చేయ‌డం పుట్టింటి నుంచి ల‌క్ష‌ల రూపాయల‌ను తీసుకురావాల‌ని ఆమెను ఇంటి నుంచి గెంటేశారు అత్త‌మామ‌లు. దీంతో స‌హించ‌లేని బాధితురాలు వారిపై కేసు పెట్ట‌డంతో విష‌యం మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

  ఈ దారుణ‌మై సంఘ‌ట‌న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. బాగా డ‌బ్బులు ఉన్న ఇంట్లో  పుట్టిన యువకుడు.. అమాయకురాలైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. అనంత‌రం ఆమెను టార్చ‌ర్ చేసిన ఘ‌ట‌న పోలీసుల‌కు చేరింది. శోభనం రోజు నుంచి ఫారిన్ వెళ్లినా వేధింపులు ఆప‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది బాధితురాలు.  ఫిర్యాదు మేర‌కు ఫారిన్‌లో ఉన్న భ‌ర్త‌తో పాటు అత్త‌మామ‌ల‌, అలాగే భ‌ర్త కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం పోలీసులు విచార‌ణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: