వర్షాలు కురవాలని.. బాలికను నగ్నంగా ఊరేగించారు.. చివరికి?

praveen
ప్రస్తుతం మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇక సమాజం మొత్తం నాగరికత వైపు పరుగులు పెడుతోంది.. ఒకప్పటి మూఢనమ్మకాలను ఆచారాలను కూడా అన్నిటినీ వదిలేస్తున్నారు.  పాత చింతకాయ పచ్చడి ని పట్టుకుని వేలాడితే ఏమొస్తుంది కొత్త పోకడలకు పోవాలి అని కూడా చెబుతున్నారు.  కానీ ఇప్పటికీ ఈ నాగరిక సమాజంలో కూడా ఎన్నో అనాగరిక ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్ల అడుగడుగునా ఎన్నో రకాల వేధింపులను ఎదుర్కొంటునే ఉంటుంది.

 పురుషులతో సమానంగా సాధికారత సాధించే వైపుగా ఆడపిల్ల అడుగులు వేస్తుంటే ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఆడపిల్లలను ఒక ఆటబొమ్మలా చూస్తున్నారు.  ఇక ఇటీవల ఇలాంటి ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు వర్షాలు పడాలని ఎంతో మంది జనాలు దేవుళ్లకు పూజలు చేయడం చూస్తే ఇక మరి కొంతమంది ఏకంగా కప్పలను ఒక కట్టెకు కట్టుకుని వాటిని ఊరంతా తిప్పుతూ పూజలు చేస్తూ ఉంటారు.  ఇక ఇవన్నీ చూస్తుంటే పోనీలే మూఢ నమ్మకాలు అని ఊరుకుంది సభ్య సమాజం.  కానీ ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసి మాత్రం అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

 వర్షాలు పడాలని ఇక్కడ కొంత మంది జనాలు అమానవీయంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో గ్రామస్తులు అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. బనియ అనే గ్రామంలో వరుణ దేవుడిని ప్రార్థిస్తూ ఏకంగా బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పడం సంచలనంగా మారిపోయింది. అయితే కరువు ఏర్పడినప్పుడు ఈ తరహా ఆచారాన్ని పాటిస్తూ ఉంటాము అని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఇందులో భాగంగానే బాలికలను నగ్నంగా మార్చి కప్పం కట్టి ఆ కర్రను వారి భుజాలపై పెట్టి ఇక వీధుల్లో తిప్పటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మిగతా మహిళలందరూ భజనలు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: