రుచికరమైన చనా వెజ్ కబాబ్స్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కబాబ్స్ ఎంత రుచికరంగా వుంటాయో అందరికి తెలుసు. ఒకసారి నోట్లో పెట్టుకోని ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటుంటే ప్రాణం జివ్వుమంటుంది. ఇక ఈ  కబాబ్స్ చాలా మందికి నచ్చే స్నాక్స్. ఇంట్లో చేసుకోవడం ఎలాగో చాలా మందికి తెలియదు.కబాబ్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. చికెన్ కబాబ్స్, మటన్ కబాబ్స్ అని ఉంటాయి. కాని చనా తో కూడా కబాబ్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చనాతో వెజ్ కబాబ్స్ చేసుకోవడం చాలా సులువు. సాయంత్రం పూట మంచి స్నాక్స్ లాగా తినటానికి ఎంతో బాగుంటాయి.
చనా కబాబ్స్ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...
కాబూలీ శెనగలు (చనా) - అరకప్పు,
ఎండిన బ్రెడ్ ముక్కలు - రెండు,
శెనగపప్పు - రెండు స్పూనులు,
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు,
లవంగాలు - రెండు,
మిరియాలు - నాలుగు,
దాల్చిన చెక్క - చిన్నముక్క,
అల్లం ముక్క - చిన్నది,
ఎండుమిర్చి - రెండు,
నూనె - సరిపడినంత,
ఉప్పు - తగినంత...
చనా కబాబ్స్ తయారు చేసే విధానం...
ముందుగా కాబూలీ శెనగలు, శెనగపప్పు కలిపి రెండు గంటలపాటూ ముందే నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్లో ఆ కాబూలీ శెనగలు, శెనగపప్పు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, నీళ్లు వేసి బాగా ఉడికించాలి. ఆ మిశ్రమం చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ కాబూలీ శెనగల మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఎండిన బ్రెడ్ ముక్కలను మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని శెనగల మిశ్రమంలో కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి కాస నూనె వేసి వేడి చేసుకోవాలి. శెనగల మిశ్రమాన్ని కబాబ్స్ లా చేత్తో అద్దుకుని పెనం మీద కాల్చాలి. రెండు వైపులా బంగారువర్ణంలోకి వచ్చేలా వేయించాలి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: