రుచికరమైన పాలకూర పలావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పలావ్ ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసు. ఈ రుచికరమైన పలావ్ పాల కూరతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇక ఆరోగ్యకరమైన పాలకూర పలావ్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...
పాలకూర పలావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు... బాస్మతి బియ్యం - రెండు కప్పులు, పాలకూర తరుగు - కప్పునిండా, ఉల్లిపాయ ముక్కలు -పావు కప్పు, పచ్చి మిర్చి - నాలుగు, లవంగాలు - నాలుగు, యాలకులపొడి - అర టీస్పూను, టొమాటో తరుగు - అరకప్పు, గరం మసాలా - అర టీస్పూను, జీడిపప్పులు - గుప్పెడు, నూనె - సరిపడినంత, ఉప్పు - తగినంత, అల్లం వెల్లులి ముద్ద - ఒక టీస్పూను.
పాలకూర పలావ్ తయారు చేయు విధానం...
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటూ నానబెట్టుకోవాలి. పాలకూర తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేయాలి. పచ్చిమిర్చి, గరంమసాలా, లవంగాలు, యాలకుల పొడి, జీడి పప్పు వేసి వేయించాలి. అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్టును వేసి వేయించాలి. సరిపడా ఉప్పు కూడా వేసి వేయించాలి. అవి బాగా వేగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి వేయించాలి. రెండు నిమిషాలు వేగాక అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టేయాలి. చివర్లో కాస్త నిమ్మరసం చల్లి, గరిటెతో ఓసారి కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే పాలక్ పలావ్ తినడానికి సిద్ధంగా ఉంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: