ఈ స్వీట్ పొంగల్ ని తింటే ఈ జన్మలో మరిచిపోరు.. ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సౌత్ ఇండియా వంటల్లో ఫేమస్ వంటకం స్వీట్ పొంగల్. దీనినే చక్కెర పొంగల్ అని కూడా అంటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ పొంగల్ పండుగ సమయాల్లో అందరూ చేస్తుంటారు. ఈ స్వీట్ పొంగల్ ని ఇష్టపడని వారు ఎవరు వుండరు. అంత రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఈ స్వీట్ పొంగల్ కూడా చాలా మంచిది. ఇది తింటే చిన్న పిల్లలు చాలా పుష్టిగా బలంగా ఉంటారు. కాబట్టి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఈ రోజు ఈ స్వీట్ పొంగల్ ని ఎలా చెయ్యాలో తెలుసుకుందామా.. ఇంకెందుకు ఆలస్యం.. చూడండి..
స్వీట్ పొంగల్ తయారు చేసేందుకు కావాల్సిన పదార్ధాలు...
ప్రధాన పదార్థం...
1 కప్ బియ్యం...
1/2 కప్ పెసరపప్పు....
ప్రధాన వంటకానికి....
1 కప్ తురిమిన టెంకాయ....
5 టీ స్పూన్ నెయ్యి....
1 కప్ బెల్లం పొడి....
అవసరాన్ని బట్టి యాలకులు....
అవసరాన్ని బట్టి జీడిపప్పు...
అవసరాన్ని బట్టి నీళ్ళు....
స్వీట్ పొంగల్ తయారు చేసే విధానం...
ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో పెట్టి 4 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.
ఇప్పుడు కుక్కర్ ఆవిరి పోయే వరకూ ఉంచి.. ఉడికిన అన్నం మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా చిదమాలి. ఇందులోనే కొద్ది కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి.
ఇప్పుడు పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పులు వేసి వేయించి ఓ గిన్నెలోకి పక్కనతీయాలి.
ఇప్పుడు అదే పాన్‌లో బెల్లం, నీరు వేయాలి. అందులోనే యాలకులు వేయండి. బెల్లం కరిగేలా వేడి చేయండి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో యాలకులను వేయాలి. ఇది స్వీట్ రెసిపీకి మంచి టేస్ట్‌ని ఇస్తుంది.
బెల్లం మిశ్రమం మరుగుతున్నప్పుడు బియ్యం మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కడపాలి.
ఇప్పుడు పొంగల్ మిశ్రమాన్ని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో నెయ్యి వేయాలి. ఇలా తయారైన పొంగల్‌ని ఓ బౌల్‌లోకి తీసుకుని జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. ఇది వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: