సేమ్యా చికెన్ బిర్యాని ఎలా...?

Sahithya
మనకు ఓపిక ఉండాలే గాని చికెన్ బిర్యానిలో ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు. తాజాగా మీకోసం సేమ్యా బిర్యాని ఎలాగో చెప్తాను. కావలసిన పదార్థాలు ఏంటీ అంటే... సేమియా-అర కేజి కావాలి. నిమ్మ కాయ-1 చాలు, చికెన్‌- అర కేజి, పచ్చి మిర్చి-10 గ్రా, దాల్చిన చెక్క-1 చాలు. లవంగాలు-6 కావాలి. ఉల్లిపాయలు-2 కావాలి, నూనె- తగినంత, కొత్తిమీర- 6 రెబ్బలు తీసుకోండి.  అల్లం వెల్లుల్లి ముద్ద- 20గ్రా, ఉప్పు- తగినంత, బిర్యానీ ఆకు- 10గ్రా, యాలకులు-2, జీడి పప్పు- 200 గ్రా, పసుపు- చిటికెడు చాలు.

తయారు చేసే విధానం ఎలా అంటే...  ముందుగా స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి... అందులో సేమియా వేసి, ఒక స్పూను నిమ్మ రసం వేసి... ఒక స్పూను నూనె వేసి అయిదు నిమిషాలు ఉంచి దించండి. తడి బట్ట తీసుకుని ఉడికిన సేమియాను అందులో వేసి వడగట్టాలన్నమాట. నీరంతా పోయిన తర్వాత సేమియాను ఒక ప్లేటులోకి తీసి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్‌ పై మరో గిన్నె ఉంచి, కొద్దిగా నూనె వేసి, శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్‌ ముక్కలను అందులో వేసుకుని చిన్న మంటపై అయిదు నిమిషాలు ఉంచాలి.

లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు అన్ని కలిపి మిక్సీ లో వేసి పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడి చికెన్‌ పై చల్లి, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపండి. అలాగే చిన్న మంటపై మరో అయిదు నిమిషాలు చికెన్‌ ను ఉడికించి, ఆ పై సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలపండి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసి... కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడి పప్పు వేసి బాగా కలిపి దించండి. అంతే సేమ్యా  బిర్యాని రెడీ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: