రాగి ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఎంత రుచి.. ఎంత ఆరోగ్యమో తెలుసా?

Durga Writes

రాగి ముద్దా, రాగి రొట్టె ఇప్పుడు రాగి ఇడ్లీ.. అన్ని వినడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయ్ కదా!  ఆరోగ్యానికి కూడా ఎంతోమంచిది ఈ రాగి ఇడ్లీ. మరి అలాంటి రాగి ఇడ్లీ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఇది మంచి టిఫిన్. అయితే సాధారణ ఇడ్లీకి బదులు రాగి పిండి ఇడ్లీని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతుంది. 

 

ఇంకా సాధారణ ఇడ్లీతో పోలిస్తే ఈ రాగి ఇడ్లీ పోషకాలపరంగానూ చాల మెరుగైన ఆహారం ఇది. ఇంకా అలాంటి ఆహారానికి మీరు కూడా చేసుకునేందుకు ప్రయత్నించండి. అలాంటి రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి ఇంట్లో ప్రయత్నించండి. అయితే ఈ పిండి ఒకసారి కలిపితే రెండు రోజులైనా దాని రుచిని ఆస్వాదించండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

 

ఇడ్లీ రవ్వ- 1 కప్పు

 

రాగి పిండి- 2 కప్పులు

 

మినపప్పు- అరకప్పు,

 

మెంతులు- 1 చెంచా

 

ఉప్పు-రుచికి తగినంత 

 

తయారీ విధానం..                                  

 

 

రాగి ఇడ్లీ తయారీకి ముందు రోజు సాయంత్రం మినపప్పు, మెంతులు కలిపి నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండి, ఇడ్లిరవ్వ, ఉప్పు కలుపుకొని రాత్రంతా పులియబెట్టాలి. ఆ గిన్నెకు మూతగా ఒక గుడ్డకట్టి బయటే ఉంచాలి. ఈ పిండిని చేజారుగా కలిపి ఉదయాన్నే ఇడ్లీ పాత్రల్లో వేసుకొంటే వేడివేడి రాగిపిండి ఇడ్లీ రెడీ. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాలు పాటించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: