ఆకలిని పుట్టించే పైనాపిల్ చారు ఏలా చేయాలంటే..

venugopal Ramagiri
పైనాపిల్,అనాస...పేరేదైనా ఈ పండు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ విరివిగా లభ్యమవుతోంది.జామ్‌లు,సిరప్‌లు,జ్యూస్‌ల రూపంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు..మనదేశంలోనూ ఇది ఎక్కువగానే దొరుకుతుంది.ఇక పైనాపిల్‌ను తరచూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఇక ఈ పైనాపిల్ తో చారు కూడా చేయవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  



కావలసినవి:
కందిపప్పు–పావుకప్పు...నీళ్లు–ముప్పావు కప్పు...పసుపు–పావు టీ స్పూను...పైనాపిల్‌ రసం కోసం పైనాపిల్‌ తురుము–ఒక కప్పు...తరిగిన టమాటా–1...నీళ్లు– ఒకటిన్నర కప్పులు...చారు పొడి–2 టీ స్పూన్లు...ఉప్పు–తగినంత....



పొడి చేయడానికి కావలసినవి:
నూనె–ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు...ఆవాలు–అర టీ స్పూను...ఎండుమిర్చి–3...కరివేపాకు–మూడు రెమ్మలు...ఇంగువ–పావు టీ స్పూను...జీలకర్ర–అర టీ స్పూను...మిరియాలు–4,వెల్లుల్లి రేకలు–2...



తయారీ విధానము:: 
కందిపప్పును శుభ్రంగా కడిగి,ముప్పావు కప్పు నీళ్లు,పసుపు జత చేసి కుక్కర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి.చల్లారాక మెత్తగా మెదపాలి ∙జీలకర్ర, మిరియాలు,వెల్లుల్లి మిక్సీలో వేసి తిప్పాలి(మరీ మెత్తగా చేయకూడదు)..పైనాపిల్‌ ను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి..సగం ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి,ఒక పాత్రలోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్‌లో ఒక టమాటా వేసి కొద్దిగా ముక్కలుగా ఉండేలా తిప్పాలి..స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి.. జీలకర్ర,మిరియాల మిశ్రమం జత చేసి బాగా కలపాలి..కరివేపాకు,ఇంగువ వేసి మరోమారు కలపాలి.చిదిమిన టమాటా గుజ్జు జత చేసి రెండు మూడు నిమిషాలు కలపాలి. పైనాపిల్‌ గుజ్జు జత చేసి మరో రెండు నిమిషాలు బాగా కలియబెట్టాక,మెదిపిన పప్పు జత చేసి బాగా కలపాలి..పైనాపిల్‌ ముక్కలు,నీళ్లు జత చేసి మరిగించాలి..రెండు టీ స్పూన్ల చారు పొడి వేసి కలియబెట్టి..మంట బాగా తగ్గించి సుమారు పది నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడి అన్నంలో వడ్డించాలి .ఈ చారు బాగా ఆకలిని పుట్టిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: