రుచిక‌ర‌మైన ` గోంగూర ప‌చ్చ‌డి `

Kavya Nekkanti
కావాల్సిన ప‌దార్ధాలు:
గోంగూర : 2 కట్టలు
ధనియాలు : 1/2 కప్పు
శెనగపప్పు : 1స్పూను
నూనె : 2స్పూన్లు


ఉప్పు :  సరిపడా
పచ్చిమిర్చి : 20
వెల్లుల్లి రెబ్బలు : 2
ఉల్లిపాయలు 1


తయారీ విధానం:
ముందుగా ఒక పాన్‌లో గోంగూర ఆకులు, పచ్చిమిర్చి, వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి పావు గంట స్లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకొన్న పచ్చిమిర్చి వెల్లుల్లి, ధనియాలు, జీలకర కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్‌ చేసుకోవచ్చు. తర్వాత అందులో గోంగూర ఆకులు కూడా వేసి మరో రెండు నిమిషాలు గ్రైండ్‌ చేసుకోవాలి.


ఆ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర, శెనగపపప్పు, కరివేపాకు, వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల, వెల్లుల్లి రెబ్బలు వేసి మరో రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌ మీద వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గ్రైండ్‌ చేసి పెట్టుకొని గోంగూర మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్‌ చేసి వెంటనే స్టౌ ఆఫ్‌ చేయాలి. అంతే రుచిక‌ర‌మైన గోంగూర ప‌చ్చ‌డి రెడీ. ఇది రైస్‌ బెస్ట్‌ కాంబినేషన్‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: