వీడసలు తండ్రేనా.. భార్యను కొట్టి.. కూతురిని దారుణంగా?

praveen
కోపాన్ని తగ్గించుకున్నప్పుడు.. నోటిని అదుపులో పెట్టుకున్నప్పుడే మనిషి మనిషిలా బ్రతకగలడు అని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మనుషుల్లో అలాంటి స్వభావం ఎక్కడ కనిపించడం లేదు. కోపం వచ్చిన తర్వాత తాము మనుషులం అన్న విషయాన్ని కూడా మరిచిపోతున్నారు ఎంతోమంది. తద్వారా ఇక అడవుల్లో ఉండే క్రూర మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఎదుటివారి ప్రాణాలు తోడేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కేవలం పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా ఇక ఇలా జాలి దయ చూపించకపోవడం గమనార్హం.

 కంటికి రెప్పలా కాచుకోవాల్సిన పిల్లల విషయంలోనే తల్లిదండ్రులు యమకింకరులుగా మారిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. చిన్న చిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ చివరికి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే వెలుగులోకి వచ్చింది. వంట చేయకపోవడంతో భార్యపై కోపంతో ఊగిపోయిన భర్త ఇక విచక్షణ కోల్పోయి ఆ కోపాన్ని కూతురు మీద చూపించాడు.

 ఏకంగా నాన్న నాన్న అంటూ ముద్దుగా పిలిచే చిన్నారి కూతురు విషయంలో కనీసం మానవత్వాన్ని చూపించకుండా తల నరికేశాడు ఆ తండ్రి. ఇక బాలిక మృతదేహాన్ని నది ఒడ్డున పూడ్చి పెట్టాడు. ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది. సరౌని గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల మద్యం సేవించి ఇంటికి వెళ్ళాడు. అయితే అతను ఇంటికి వెళ్లే సమయానికి భార్య వంట చేయలేదు అని ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే కోపంలో భార్యపై దాడికి కూడా పాల్పడ్డాడు. దెబ్బలు తాళలేకపోయిన భార్య తనను తాను కాపాడుకునేందుకు కేకలు పెట్టుకుంటూ వెళ్లి పక్కింట్లో తల దాచుకుంది. అయితే నాలుగేళ్ల కూతురు మాత్రం ఇంట్లోనే ఉంది. దీంతో భార్యపై కోపాన్ని కూతురుపై చూపించి దారుణంగా తల నరికేశాడు. ఇక నిందితుని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: