ఛీ ఛీ.. కన్నతల్లే ఇలా చేస్తే.. పిల్లలకు రక్షణ ఎక్కడిది?

praveen
ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు అని అంటూ ఉంటారు పెద్దలు. ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన మహామహులు సైతం తల్లి గర్భం నుంచే పుట్టిన వారు అని చెబుతూ ఉంటారు. అయితే తల్లి పిల్లలను నవ మాసాలు మోయడమే కాదు జన్మనిచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటుంది. పిల్లలకు ఏ సమస్య రాకుండా అన్ని తానే చూసుకుంటూ ఉంటుంది. కానీ నేటి కలికాలంలో మాత్రం అటు తల్లి ప్రేమలో కూడా కల్తీ ఏర్పడిందేమో అని అనుమానం వచ్చే విధంగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా తల్లి ప్రేమకే మచ్చ తెచ్చే విధంగా కొంతమంది తల్లులు వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి.

 పేగు తెంచుకొని పుట్టిన పిల్లల విషయంలో కాస్తయినా కనికరం చూపకుండా దారుణంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇక ఇటీవల రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో ఇలాంటి దారుణ ఉదాంతమే వెలుగు చూసింది. ఒక మహిళ తన ప్రియుడితో కలిసి ఏకంగా కన్నా కూతుర్నే కిరాతకంగా చంపేసింది. అభం  శుభం తెలియని మూడేళ్ల పాపను గొంతు నులిమి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసింది. అయితే ఇక స్థానికులు ఇది గుర్తుంచి పోలీసులకు సమాచారం అందించగా.. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

 శ్రీ గంగానగర్ లోని శాస్త్రి నగర్కు చెందిన సునీతకు ఐదుగురు పిల్లలు. ఆమె ఏడాది క్రితమే సన్నీ అనే వ్యక్తితో ప్రేమలో పడి చివరికి భర్తను దూరం పెట్టింది. ఇక ప్రియుడితో కలిసి వేరే ఇంట్లో సహజీవనం చేస్తుంది. ఇక ఇద్దరు కూతుర్లు సునితతో ఉంటే మరో ముగ్గురు పిల్లలు ఇక ఆమె భర్తతో ఉంటున్నారు. అయితే ఇటీవల సునీత ప్రియుడుతో రాసలీలలు కొనసాగించేందుకు ఏకంగా మూడేళ్ల కూతురు గొంతు నులిమి చంపేసింది. అనంతరం కూతురు మృతదేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి ఇక రైలులో వెళ్తూ బయటికి పడేశారు. ఇక పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: