చెడ్డీలో మూత్రం పోసాడని.. మూడేళ్ల బాలుడిని దారుణంగా?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషిలో అదే మానవత్వం కనుమరుగవుతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో జాలి దయ చూపించే మనిషి ఇక ఇప్పుడూ ఉన్మాదిగా మారిపోయి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలే వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇలాంటి ఘటనలు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా అభం శుభం తెలియని చిన్న పిల్లల విషయంలో కూడా మనుషులు కాస్తయినా మానవాత్వాన్ని చూపించడం లేదు అని చెప్పాలి. దారుణంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు.

 ఇక్కడ కూడా ఇలాంటి ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అక్రమ సంబంధం కారణంగా మరో ప్రాణం చివరికి బలైంది. ఏకంగా తల్లి ప్రియుడి కర్కషత్వానికి అభం శుభం తెలియని ఒక బాలుడు చివరికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ప్రియురాలి కొడుకు విషయంలో రాక్షసుడిలా ప్రవర్తించిన ఒక వ్యక్తి చిన్నారి బాలుడి ఉసురు తీసేసాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒక మహిళ కు పెళ్లి అయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్లపాటు సాఫీగా సంసారం సాగినప్పటికీ ఆ తర్వాత కలహాలు ఏర్పడటంతో ఇక భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది సదరు మహిళ.

 ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన మోహన్ అనే 35 ఏళ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడగా పరిచయం సహజీవనం వరకు వెళ్ళింది.  దీంతో ఇక ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అతనితో కలిసి సహజీవనం చేస్తూ ఉంది సదర మహిళ. 2015లో కూకట్పల్లి కాలనీకి వచ్చి కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. అయితే ఇటీవల సదరు మహిళ కొడుకు అయినా మూడేళ్ల బాలుడు చెడ్డీలో మూత్రం పోసుకున్నాడు అని మోహన్ కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే సదరు బాలుడి తలపై కొట్టి ఇక మెడ అదిమి ఉంచడంతో అతడు మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహన్ ను అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: