భార్య కాపురానికి రావడం లేదని.. కూతురిపై భర్త రాక్షసత్వం?

praveen
భారతదేశంలో వివాహాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి ఇక వారి వారి సంప్రదాయం ప్రకారం వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఇక కట్టుకున్న వారితోనే కలకాలం జీవించాలని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. అయితే నేటి రోజుల్లో మాత్రం ఇలా వైవాహిక బంధానికి ఎక్కడ మనుషులు విలువ ఇవ్వడం లేదు అన్నది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది అని చెప్పాలి.

 సాధారణంగా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే కొంతమంది ఇక ఇలాంటి సమస్యలను సామరస్యంగా  చర్చించుకుని ముందుకు సాగుతూ ఉంటే.. మరికొంతమంది మాత్రం చిన్న సమస్యను పెద్దదిగా మార్చుకుని ఇక దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతూ ఉండడం చూస్తూ ఉన్నాము. చివరికి భార్య భర్తలు స్వార్థం కోసం ఆలోచించి పిల్లలను అనాధలుగా మారుస్తూ ఉన్న ఘటనలు  సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా భార్యాభర్తలు మధ్య ఉన్న గొడవలు కారణంగా అభం శుభం తెలియని చిన్నారి బలైపోయింది. ఈ ఘటన మహబూబ్నగర్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పాలకొండ తండాకు చెందిన నినావత్ శివ శోభకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. అయితే పెళ్లి అయిన కొన్నాళ్లకే శివ మద్యానికి  బానిసగా మారిపోవడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.. శివ దారుణంగా భార్యని కొడుతూ ఉండడంతో విసిగిపోయిన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది.

 అయితే ఇటీవల ఏకంగా అత్తారింటికి వెళ్లిన శివ తన వెంట పెద్ద కూతురు కీర్తనను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత మద్యం సేవించి భార్య మీద కోపంతో ఇక కూతురిపై చేయి చేసుకున్నాడు. చిన్నారి ఏడుస్తూ అమ్మ కావాలంటూ మారం చేయడంతో.. మరింత కోపంతో ఊగిపోయిన శివ కన్న కూతురు అనే కనికరం లేకుండా ముక్కు కోసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మళ్ళీ ఏమి ఎరగనట్లు పాప పలకడం లేదని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే కూతురు మృతి చెందింది అన్న విషయం తెలుసుకున్న తల్లి శోభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: