వీడసలు తండ్రే కాదు.. షూ లేస్ తో కన్న కొడుకుని చంపేశాడు?

praveen
తండ్రి అంటే ఒక ధైర్యం..  పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా తమకు వెన్ను తట్టే తండ్రి ఉన్నాడు అనే భరోసా ఉంటుంది. తండ్రి కూడా తన పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా చూస్తూ ఊరుకోడు. ఆ కష్టాన్ని పారదోలడానికి ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటాడు అని చెప్పాలి. చూడ్డానికి ఎంతో గంభీరంగా కనిపించే తండ్రి లోలోపల మాత్రం పిల్లలపై అమితమైన ప్రేమను కలిగి ఉంటాడు అన్నది ప్రతి ఒక్క తండ్రికి తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇలా మానవ బంధాలకే మచ్చ తెచ్చే విధంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 తండ్రి అనే బంధానికి  కళంకం తెచ్చే విధంగా ఎంతోమంది నీచమైన పనులకు పాల్పడుతున్నాడు. కొంతమంది ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన పిల్లల విషయంలో దారుణంగా వ్యవహరిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తుంటే మరికొన్ని ఘటనల్లో ఏకంగా కడుపున పుట్టిన పిల్లలనే హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయ్. ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 కొడుకును కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రి చివరికి కన్న కొడుకుని దారుణంగా ఉరేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సాంబాల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే ధర్మేష్ కు తన భార్యపై అనుమానం ఎక్కువ. తనకు తెలియకుండా తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని సూటిపోటి మాటలతో  వేదిస్తూ తరచు గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవలే భార్యపై ఉన్న కోపాన్ని ఏకంగా కొడుకు పై చూపించాడు. కొడుకుని దారుణంగా కొట్టి షూ లేస్ తో ఉరివేసి చంపేశాడు. పోలీసులు అతని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: