గవర్నమెంట్ ఉద్యోగం కోసం.. భర్తను చంపిన భార్య?

praveen
సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా  ఉండాలి అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యతకు కాదు ఏకంగా మనస్పర్ధలకు గొడవలకు చిరునామాగా మారిపోతూ ఉంది అని చెప్పాలి. అంతేకాకుండా ఇక దాంపత్య బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత భార్య భర్తలు కష్టసుఖాలు ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఏకంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వారు కష్టసుఖాల్లో తోడు ఉండడం కాదు దారుణంగా కట్టుకున్న వారిని కడతెరుస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్.

 వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇక యువకులు పెళ్లి చేసుకుంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అని ప్రతిక్షణం భయపడుతున్నారు. పెళ్లి అనే మాట వస్తూనే తప్పించుకు తిరుగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా తన పసుపు కుంకాల గురించి కూడా ఆలోచించ లేకపోయినా సదరు మహిళ దారుణంగా భర్తను చంపేందుకు కూడా వెనకాడ లేదు. భర్తను దారుణంగా హత్య చేయడమే కాదు ఇంట్లో జారిపడి తలకు గాయం అయింది అంటూ ఇక కొత్త నాటకానికి తెరలేపి  స్వయంగా ఆసుపత్రిలో చేర్పించింది భార్య.

 ఇక తర్వాత భర్త చనిపోగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది అని చెప్పాలి. శ్రీనివాస్ అనే 50 ఏళ్ల వ్యక్తి కలెక్టరేట్లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. కాగా ఇటీవల ఇంట్లో జారిపడ్డాడని తలకు గాయమైంది అంటూ భార్య సీతామాలక్ష్మి ఆసుపత్రిలో చేర్పించింది. తర్వాత రోజే శ్రీనివాస్ చనిపోయాడు. కుమారుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా భార్య నిజం అంగీకరించింది. భర్త రోజు తాగొచ్చి తనను హింసిస్తున్నాడని ఇక భర్తను చంపితేఇక తన ఉద్యోగం కూడా వస్తుందని ఆశతో హత్య చేసినట్లు నేరం అంగీకరించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: