"స్కూల్ చిన్నారులపై అఘాయిత్యాలు"... ప్రభుత్వం ఇలా చేస్తే !

VAMSI
మన చుట్టూ ఉన్న సమాజం ఎంత దారుణంగా తయారవుతోంది అంటే రాను రాను ఆడపిల్లల్ని కనాలంటేనే భయం పుట్టేలా ? ఎందుకంటే నేడు సంవత్సరం ఆడబిడ్డ నుండి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలకుండా హత్యాచారానికి పాల్పడి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రపంచంలోని నలుమూలలా ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అయితే ఇవన్నీ చూస్తున్న ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలం అవుతున్నాయి. ఒక ఆడపిల్లను ఈ రోజు కని పెంచి ఒక అయ్యేచేతిలో పెట్టె వరకు అడుగడుగునా ఎన్నో గండాలు దాటాల్సి వస్తోంది. ఎక్కడా ఆడపిల్లలకు రక్షణ కలగడం లేదు.
ఆఖరికి మనమంతా దేవాలయంలా భావించే స్కూల్ లలో కూడా ఈ భయంకర ఘోరాలు జరుగుతున్నాయి అంటే, ఇంకెక్కడ పిల్లలకు రక్షణ కల్పించగలమో ఒకసారి ఆలోచించుకోండి. ఈ మధ్యనే రెండు ఘటనలు అలాంటివి జరిగి ప్రతి తల్లికి దుఃఖాన్ని మిగిల్చాయి. హైదరాబాద్ లోని ఒక స్కూల్ లో నాలుగేళ్ళ చిన్నారిని అదే స్కూల్ లో డ్రైవర్ గా పని చేస్తున్న ఒక కామాంధుడు హత్యచారానికి పాల్పడడం భరతమాత సైతం సిగ్గుపడే అంశం అని చెప్పాలి. దీనిపై చర్చలు జరుగుతున్న క్రమంలో గత వారంలో నెల్లూరు లో మరొక ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిది సంవత్సరాల అమ్మాయిపై స్కూల్ లో పీఆర్వో గా పనిచేస్తున్న వ్యక్తి పశువులా గత ఆరు నెలల నుండి తనను లైంగికంగా ఇబ్బంది పెట్టాడట. పైగా పాప తన అమ్మానాన్నలకు చెబితే వారిని చంపేస్తానని బెదిరించేవాడట. చివరికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
అయితే ఇలా రోజుకు ఒక ఘటన జరుగుతూ ఆడపిల్లలు కన్న తల్లితండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరి ఇలా స్కూల్ లో అమాయక ఆడపిల్లలపై ఈ అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే సమాజం మరియు ప్రభుత్వం బాధ్యత ఏమిటన్నది చూడాలి. ముఖ్యంగా స్కూల్స్ లో మేల్ స్టాఫ్ ను తీసుకునేటప్పుడు సాధ్యమైనంతవరకు అతని బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేసి ఉద్యోగంలోకి తీసుకోవాలి. పిల్లల తల్లితండ్రులు ఆడపిల్లలకు ఎవరితో ఎలా మెలగాలో అన్నది అవగాహన కల్పించాలి. ప్రభుత్వం సైతం సెపరేట్ గా ఒక టీం ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ లో పిల్లలకు మరియు టీచర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలి. ఇది మాత్రమే కాకుండా ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిని నడిరోడ్డులో బహిరంగంగా ఉరితీస్తే మరొకరికి ఆ పని చేయాలంటే భయం కలుగుతుంది.




 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: