పసికందుపై వీధి కుక్క దాడి.. పేగులు బయటకు రావడంతో?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక కనబడిన అందరిపై కూడా దాడికి పాల్పడుతూ గాయాల పాలు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలతో ఎక్కడైనా వీధి కుక్కలు కనిపించాయి అంటే చాలు ప్రతి ఒక్కరు భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులపై దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వారిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఇక తల్లిదండ్రులు ఇద్దరు కూడా భవన నిర్మాణంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల ఎప్పటిలాగానే పనికి వెళ్లారు. ఈ క్రమంలోనే వారి 7 నెలల పసికందు పై ఒక వీధి కుక్క దారుణంగా దాడి చేసింది. ఇక ఈ దాడిలో ఏడు నెలల చిన్నారి పేగులు బయటికి రావడంతో చివరికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మనసును కదిలించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఉన్నా హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలె వార్డ్ సెక్టార్ 100 లో వెలుగు చూసింది.

 ఈ ఘటనతో అటు స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అని చెప్పాలి. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతుండగా కూలి పనులు చేసుకునే ఒక కుటుంబ తమ 7 నెలల పాపతో అక్కడే ఉంటుంది. ఈ క్రమంలోనే సాయంత్రం తల్లిదండ్రులు పనిలో నిమగ్నమైన సమయంలో వీధికి ఒక చిన్నారిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శిశువును ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. పేగులు బయటికి రావడంతో చివరికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు ఇలా దాడి చేయడం మొదటిసారి కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: