బస్సు డ్రైవర్ బ్రేక్ వేయబోతుండగా.. పడగ విప్పిన నాగుపాము.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో ఎన్నో విషసర్పాలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు ఎక్కడపడితే అక్కడ విషసర్పాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం.  కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన చివరికి ఎంతోమంది పాము కాట్లకు గురవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. కేవలం జనావాసాల్లోకి మాత్రమే కాదు వాహనాల్లో కూడా రహస్యంగా దూరుతున్న పాములు   ఎంతోమంది వాహనదారులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 ఇక్కడ ఒక బస్సు డ్రైవర్ త్రుటిలో  పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.   ప్రాణాపాయం మంది బయటపడ్డాడు. సాధారణంగా బస్సు నడుపుతున్న వ్యక్తి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాగే అప్రమత్తంగా ఉన్న వ్యక్తి ఒకానొక సమయంలో బ్రేక్ వేయబోయాడు. ఇంతలో ఇక బ్రేక్ కిందిభాగంలో బుస కొడుతూ ఒక పాము పడగ విప్పడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కర్ణాటకలోని చిన్న మంగళూరు జిల్లా కుప్పి తాలూకా విజయపుర గ్రామంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

 రోజు లాగానే బస్సు డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసాడు. బస్సు సగం దూరం కూడా వెళ్ళింది. ఇంతలో బ్రేక్ వేద్దామని బ్రేక్ పెడల్ పై కాలు వేయబోతుండగా.. అక్కడ కింది భాగం లో ఒక నాగు పాము బుసలు కొడుతూ ఎంతో కోపంగా కనిపించింది.  ఈ క్రమంలోనే బ్రేక్ పెడల్ మీద నుంచి కాలు తీసిన డ్రైవర్ ఎంతో చాకచక్యంగా ఇంజన్ ఆఫ్ చేసి బస్ ఆపేసాడు. అనంతరం ప్రయాణికులందరిని కిందకి దింపి ఆ పాము ఒక కర్ర సహాయంతో బయటకు తీసాడు. ఈ ఘటన తో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: