హాస్టల్లోకి వచ్చిన విషసర్పం.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
సాధారణంగా వర్షాకాలం కావడంతో ఎక్కువగా విషసర్పాలు జనావాసాల్లోకి వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది పాముకాటుకు గురి కావడం వంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఏకంగా పాముకాటు కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక్కడ ఒక విషసర్పం అభం శుభం తెలియని ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రాణం తీసింది అని చెప్పాలి. ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 అయితే వార్డెన్ సరైన సమయంలో స్పందించకపోవడం కారణంగానే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆరోపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే  వెంటనే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ హోటల్ దగ్గర ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు హాస్టల్లో సరైన భోజనం పెట్టిన కారణంగానే విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన కూడా తరచూ వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు నిజాంబాద్ జిల్లాలో ఏకంగా హాస్టల్లోకి విషసర్పం వచ్చి స్టూడెంట్ను కాటేసి చంపేయడం మరింత సంచలనంగా మారింది.

 నిజాంబాద్ జిల్లా బీర్కూర్ బిసి బాయ్స్ హాస్టల్ లో పాము కాటుకు గురై విద్యార్థి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. 12 ఏళ్ళ సాయిరాజ్ అనే విద్యార్థి చివరికి ఇలా ప్రాణాలు కోల్పోయాడు. అయితే శుక్రవారం రాత్రి సమయం లో హాస్పిటల్లో వాంతులు చేసుకున్నాడని దీంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు.  అదే సమయం లో ఇక సాయిరాజ్ రూమ్ లో ఉన్న పామును విద్యార్థులు చంపడం గమనార్హం. ఆస్పత్రికి వెళ్లిన  సమయంలో నోట్లో నుంచి నురగా బయటకు రావడంతో ఇక పాము కాటేసిన ట్లు వైద్యులు నిర్ధారించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడు అని ఆరోపిస్తూ తల్లిదండ్రులు  హాస్టల్ ఎదుట ఆందోళన చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: