పరాయి స్త్రీ పై మనసు పడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యత కు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తరువాత ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది. అక్రమ సంబంధాల కారణంగా చేజేతులారా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు అని చెప్పాలి.

 సాధారణంగా భర్త తనను తప్ప వేరే స్త్రీని దురుద్దేశంతో చూస్తే అస్సలు తట్టుకోలేరు భార్య. ఈ క్రమంలోనే తన భర్తను దక్కించుకోవడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.. ఇక్కడ ఓ భార్య చేసిన పని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వకుండా ఉండలేరు.  తనను కాదని పరాయి స్త్రీల వెంట తిరుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని కోపంతో ఏకంగా భార్య తన భర్తపై సలసల కాగుతున్న నూనె పోసింది. ఈ ఘటనలో భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు.

 హైదరాబాద్ నగరంలోని కూల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గిరిధర్ రేణుక దంపతులు ఆంధ్ర ప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.  కాగా జియాగూడ లో ఒక కాబేళ లో పని చేస్తున్నాడు గిరిధర్. అయితే హైదరాబాద్  వచ్చిన తర్వాత పరాయి మహిళల వ్యామోహంలో పడి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఇంటికి రావడం కూడా మానేశాడు అని భార్య ఆగ్రహం తో ఊగిపోయింది. ఈ విషయంపై ఇటీవల భర్తతో గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య భర్త తలపై కాగుతున్న నూనె పోసింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: