భార్యకు పురిటినొప్పులు.. తోపుడు బండిపై ఆసుపత్రికెళ్తే?

praveen
ఇటీవలి కాలంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతూ ఉన్నప్పటికీ వాస్తవంగా మాత్రం అది ఎక్కడా అమలు కావడం లేదు అన్నది వెలుగులోకి వస్తున్న  ఘటనల ద్వారా నిరూపితమవుతుంది. ఎంతో మంది సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెలుతు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి.  ఒకవైపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ఆస్పత్రిలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించకపోవడంతో ఇక ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు అన్నది తెలిసిందే.

 అంతేకాదు ఇటీవల కాలంలో ఆసుపత్రుల్లో సామాన్య ప్రజలకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించ లేని  దుస్థితి ఏర్పడింది. దీంతో తమ ప్రియమైన వారు ఒకవేళ ప్రాణాలు కోల్పోతే భుజాన వేసుకుని వెళ్లే దుస్థితి ఏర్పడింది అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  గర్భిణి అయిన తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు భర్త.   అంబులెన్సు ఎంతకీ రాకపోవడంతో తోపుడు బండిపై స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు.  కనీసం అక్కడైనా వైద్యులు ఉంటారని కాస్తోకూస్తో వైద్యం చేస్తారని అనుకున్నాడు.

 కానీ స్థానిక ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అతనికి ఊహించని షాక్ తగిలింది.  స్థానిక ఆస్పత్రిలో వైద్యులు లేరు కనీసం నర్సులు  కూడా కనిపించకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్లోని దామోహ్  జిల్లాలో వెలుగుచూసింది. రానేహ్  ప్రాంతానికి చెందిన కైలాష్ అనే వ్యక్తి భార్య కాజల్ నిండు గర్భిణీ. ఇటీవల పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ కు కాల్ చేయగా ఎవరు రాలేదు. దీంతో చేసేదేమీ లేక తోపుడు బండిపై ఆమెను పడుకోబెట్టి కిలోమీటర్ దూరంలో  ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లాడు.  వైద్యులు నర్సులు ఎవరు అందుబాటులో లేరు చివరికి అతికష్టం మీద ఆంబులెన్స్ రాగా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు.   ఘటనపై మెడికల్ ఆఫీసర్ సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: