చేపల కోసం వల వేస్తే.. అందులో పడింది చూసి భయంతో పరుగులు?

praveen
సాధారణంగా ఎంతో మంది మత్స్యకారులు తరచు బయటకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఎప్పుడూ సాదాసీదా చేపల దొరుకుతూ ఉంటాయ్. కానీ కొన్నిసార్లు మాత్రం మత్స్యకారుల వలకు అరుదైన చేపలు చిక్కుతూ అదృష్టం వరించ డం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక కొన్ని కొన్ని సార్లు మత్స్యకారులకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి. చేపలు పట్టడం కోసం వల విసిరిన సమయంలో  ఊహించని రీతిలో పాములు వలలో చిక్కడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటివి జరిగినప్పుడు మత్స్యకారులు కాస్త భయాందోళనకు గురి అవుతూ ఉంటారు.

 ఇక్కడ మత్స్యకారులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది అని చెప్పాలి. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఎప్పటిలాగానే వల వేసారు. అయితే వల ఎంతో బరువు గా ఉండడంతో ఇక పెద్ద చేప తమ వలకు చిక్కింది అని భావించారు. తీరా బయటికి లాగి చూసి ఒక్క సారిగా భయంతో పరుగులు పెట్టారు. బీహార్ రాష్ట్రంలోని కువాన్వన్ గ్రామ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి సమీపంలో ఉన్న నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు రోజు లాగానే వల వేశారు. ఈ క్రమంలోనే వలలో ఎంతో బరువుగా అనిపించింది.

 వెంటనే ఆ వలను పైకి లాగారు మత్స్యకారులు. భారీ చేప తమ వలకు చిక్కింది అని అనుకున్నారు.. కానీ తీరా ఆ వలను ఒడ్డుకు తెచ్చి చూసిన తర్వాత అందులో చేపలకు బదులు 20 కేజీల కొండచిలువ ఉండడం చూసి ఒక్కసారిగా షాకయ్యారు.  ఇంకేముంది  గుండెలు జారిపోయినంత పని అయింది.  వాళ్లను అక్కడే వదిలేసి చివరికి అక్కడి నుంచి పరుగులు పెట్టారు.  ఈ విషయం తెలిసిన తర్వాత స్థానికులు అందరూ వలలో చిక్కుకుపోయింది తెలిసి అక్కడ గుమిగూడారు. అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది, స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: